రాష్ట్రీయం

ఒంటిమిట్ట రాముడికి సింహవాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 27: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి సింహవాహన సేవ నిర్వహించారు. ఉదయం స్వామివారి ఉత్సవమూర్తికి వటపత్రసాయి అలంకారం చేసి వేదికపై ఆశీనులను జేయించి ప్రత్యేక పూజలు హారతి ఇచ్చారు. అనంతరం మేళతాళాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సింహవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని మాడావీధులు, గ్రామంలో ఊరేగించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు. ఉదయం స్వామి నవనీత కృష్ణ అలంకాలంలో భక్తులకు దర్శనమిస్తారు.