రాష్ట్రీయం

అఖిలపక్ష సమావేశం టీడీపీ ఎత్తుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష సమావేశం ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడ అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మంగళవారం నాడిక్కడ విమర్శించారు. ఏదైనా సంకల్పం బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందని పెద్దలు అంటారని, అటువంటి సంకల్పమే లోపించిందని పవన్ పేర్కొన్నారు. సోమవారం సంధ్య ముగిసినవేళ నిశి రాత్రివేళ మంగళవారం సమావేశానికి రమ్మని ఆయన అనుచరులతో కబురు చేశారని, తొలుత ఈ సమావేశం అఖిలపక్ష సంఘాలకు మాత్రమే అని ప్రచారం చేసి, చివరికి పనిలో పనిగా రాజకీయ పార్టీలను కూడా కలిపేశారని అన్నారు. ఈ సమావేశం నిర్వహణ కేవలం తెలుగుదేశం పార్టీ రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని అన్నారు. ప్రత్యేక హోదా దక్కక ఆగ్రహంతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మందిని మరోసారి మభ్యపుచ్చడానికి ఈ సమావేశం అని జనసేన పార్టీ గట్టిగా విశ్వసిస్తోందని అన్నారు. ప్రజలను వంచించే ఎటువంటి చర్యనైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, అందుకే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాపై బీజేపీ సర్కార్ నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని తెలిసిన తొలినాళ్లలోనే అంటే కనీసం మూడేళ్ల కిందట ఏర్పాటు చేయాల్సిన అఖిలపక్ష సమావేశం, అంతా అయిపోయాక కాలం తీరిన మందు వేసినట్టు ఇపుడు ఏర్పాటు చేస్తే ఏం ఫలితం ఉండదని తెలుగుదేశం పార్టీకి తెలుసని అన్నారు. ప్రజల ఆగ్రహం అర్ధం అయ్యాక తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు మీ పాపాన్ని మాకు పంచడానికేనా ఈ సమావేశం అని ప్రశ్నించారు. ఇటువంటి కంటి తుడుపు సమావేశాలు జనసేనకు ఆమోదయోగ్యం కావని, ప్రజలకు మేలు చేసే చర్యలను చేపట్టినపుడు మాత్రమే జనసేన అండ ఉంటుందని అన్నారు. వారు ఏ పార్టీ అన్నది జనసేనకు అనవసరమని అన్నారు. ప్రస్తుత తరుణంలో మాత్రమే ప్రజాప్రతినిధులే హోదా సాధించే భారాన్ని మోయాలని, ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేయాల్సింది ప్రజా ప్రతినిధులతో కలిసి ఢిల్లీ బాట పట్టడమేనని పవన్ అభిప్రాయపడ్తాడరు.
భారత ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటు ముందు ఆందోళనకు దిగాలని, తమిళ రైతులు ఢిల్లీ నడివీధిలో చేసిన ఆందోళన స్ఫూర్తిగా రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించవద్దని చెప్పారు. ఇదంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు కలిసికట్టుగా చేయాల్సిన ప్రజాకార్యమని పేర్కొన్నారు.