రాష్ట్రీయం

మాది న్యాయపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 28: రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల విషయంలో కేంద్రప్రభుత్వం ఎందుకింత వివక్షత ప్రదర్శిస్తోందో ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తున్నా, గత కొద్దిరోజులుగా పార్లమెంటులో ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ అవిశ్వాసం ప్రకటించినా వాయిదాలతో ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారని ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్యాకేజీ మాకు వర్తింపచేయమని అడుగుతున్నాం. ఆ రోజు మీరిచ్చిన హామీలు.. విభజన చట్టంలోని అంశాలే అడుగుతున్నాం. మీరిచ్చేది ముష్టికాదు, న్యాయపరమైన హక్కు అని చంద్రబాబు స్పష్టం చేశారు. మాది ధర్మపోరాటం. న్యాయసమ్మతమైంది. ఇందులో అంతిమ విజయం మాదే. కేంద్రం మెడలు వంచైనా హక్కులు సాధిస్తాం. ప్రజలు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. శాసనసభలో బుధవారం సీఎం మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎన్డీయే నుంచి వైదొలగి అవిశ్వాసం పెట్టాం. హోదా రాయితీలు కల్పించాలని డిమాండ్ చేస్తుంటే మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు రాయితీలు ప్రకటించటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం కాదా అని నిలదీశారు. దేశాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కాగ్ నివేదికలో 16 వేల కోట్లు రెవిన్యూలోటు భర్తీ బాధ్యత కేంద్రానిదే అని స్పష్టం చేసిందని, అయితే ఇప్పటి వరకు 3973 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. తప్పుడు లెక్కలు చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లయినా రెవెన్యూ లోటు మొత్తం ఎందుకివ్వరని ప్రశ్నించారు. పోలవరానికి 5363 కోట్లు, రాజధానికి 15 వందల కోట్లు మాత్రమే ఇచ్చారని వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ నిధులు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవటం దారుణమన్నారు. నేను ఎప్పుడూ స్వార్థం కోసం ఆలోచించలేదు.. రాష్ట్రం కోసమే నా తపన.. స్వయాన వాజ్‌పేయి సైతం నా నిజాయితీని ప్రశంసించారు.. మీకు పాలనలో ఏం అనుభవం ఉందని నాపై బురదజల్లుతున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ప్రశ్నించారు. హోదా ఇవ్వలేదు.. ఎస్పీవీ అన్నారు.. మా లెక్కలో తీసుకోవాటనికి మీ పెత్తనం ఎందుకన్నారు. స్టేటస్‌ను తాకట్టుపెట్టి ఎస్పీవీ తీసుకుంటామని భావిస్తే పొరపాటే అన్నారు. నిధుల మళ్లింపు అలవాటు మీకు ఉంది.. మేం మొదటి నుంచి పారదర్శకంగా అన్నింటికీ జవాబుదారీతనంగా ఉన్నామన్నారు. ఎన్నో ప్రభుత్వాలు చూశా..నన్ను డ్యామేజీ చేసినా ఫర్వాలేదు..రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీయద్దని హెచ్చరించారు. కేంద్రానికి దాసోహం అనేది నా జీవితంలోలేదని తేల్చి చెప్పారు. హక్కులు అమలుచేస్తే రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా అభివృద్ధి చెందుతుంది.. గుజరాత్ వెనుకబడుతుందనే భావనతోనే మోదీ వివక్ష చూపుతున్నారని ఆక్షేపించారు. ఎన్ని శక్తులు అడ్డుకున్నా పోలవరాన్ని సాధించి తీరుతామన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలో ఎవరైనా అడ్డుపుల్ల వేస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, రెవిన్యూలోటు 16వేల కోట్లు, రైల్వేజోన్, పారిశ్రామిక కారిడార్లకు నిధులు, ఆయిల్ రిఫైనరీ, స్టీల్‌ప్లాంట్ తదితర అంశాలను సాధించేందుకు కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తామన్నారు. అడ్డంకులు అధిగమించి అంతిమ విజయం సాధించేందుకు ఈ శాంతియుత పోరాటంలో అంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.