రాష్ట్రీయం

కేసీఆర్‌తో నటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పలువురు నేతలతో టీఆర్‌ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ చర్చల జరుపుతున్న నేపథ్యంలో గురువారం సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ భేటీ అయ్యారు. బెంగళూరులో జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య అనంతరం ప్రధాని మంత్రి మోదీపై, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రకాశ్‌రాజ్ సీఎం కేసీఆర్‌ను కలువడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌కు వచ్చిన ప్రకాశ్‌రాజ్ గురువారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు.
అనంతరం ఆయన కేసీఆర్ వెంట అసెంబ్లీకి వచ్చారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను, నేతలను ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం చేయడంలో భాగంగానే ప్రకాశ్‌రాజ్‌తో కేసీఆర్ చర్చలు జరిపినట్టు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై త్వరలో బెంగళూరు వెళ్లనున్న కేసీఆర్ అక్కడ ఫ్రంట్ ఏర్పాటు బాధ్యతలను ప్రకాశ్‌రాజ్‌కు అప్పగించనున్నట్టు సమాచారం.