రాష్ట్రీయం

ఆర్థిక క్రమశిక్షణ తప్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆక్షింతలు వేసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ముగింపు రోజున గురువారం సభలో ‘కాగ్’ తన నివేదికను సమర్పించింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని కాగ్ తప్పుపట్టింది. ఆర్థిక సంవత్సరం 2016-17లో రాష్ట్రం రూ.1386 కోట్ల రెవిన్యూ మిగులును నమోదు చేయగా, పద్దుల నమోదులో సరైన పద్ధతులను పాటించని కారణంగా రెవిన్యూ మిగులు రూ.6,778 కోట్లు ఎక్కువ చేసి చూపిందని కాగ్ ఎత్తిచూపింది. ప్రభుత్వం చూపెట్టిన రెవిన్యూ మిగులును మినహాయిస్తే మొత్తంగా 2016-17లో రూ.5,392 కోట్ల రెవిన్యూ లోటు ఏర్పడిందన్నారు. రాష్ట్ర స్థూల గృహోత్పత్తిలో (జిఎస్‌డిపి) ద్రవ్యలోటు రూ.35,281 (5.46శాతం) చూపించిందని, అయితే రాష్ట్రం అప్పుగా తెచ్చుకున్న నిధులను రెవిన్యూ రాబడులుగా లెక్కించడం వల్ల ద్రవ్యలోటును రూ.2500 కోట్లు తక్కువ చేసి చూపించిందని కాగ్ తప్పుపట్టింది. ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన (ఉదయ్) పథకం కింద బదిలీ చేసిన మొత్తం రూ.7500 కోట్లు మినహాయించిన తర్వాత జిఎస్‌డిపిలో ద్రవ్యలోటు నిష్పత్తి 4.3శాతంగా ఉందన్నారు. ఇది 2016-17 సంవత్సరానికి 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన రాష్ట్ర ద్రవ్య బాధ్యత- బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) లక్ష్యంగా నిర్దేశించిన 3.5 శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉందని కాగ్ పేర్కొంది. ఉదయ్ పథకం కింద రూ.8,931 కోట్లు బాండ్ల ద్వారా
అప్పు తెచ్చుకుందన్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి ప్రభుత్వం రూ.7500 కోట్లు మాత్రమే డిస్కమ్‌లకు విడుదల చేసిందన్నారు. డిస్కంలకు బదిలీ చేసిన మొత్తాన్ని క్యాపిటల్ వ్యయం కింద ఈక్విటీగా పద్దుల్లో చూపించడం వల్ల రెవిన్యూ మిగులు అధికంగా కనిపించిందన్నారు. డిస్కంలకు మిగతా రుణాలకు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదమ్ పథకంలో నిర్దేశించినప్పటికీ జారీ చేయలేదని కాగ్ ఎత్తి చూపింది. క్యాపిటల్ వ్యయం రూ.33,371 కోట్లు కాగా బడ్జెట్ అంచన రూ.29,313 కోట్ల కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ ఏడాది రాష్ట్రం మొత్తం వ్యయ్లోం రెవిన్యూ వ్యయం 69 శాతంగా నమోదు కాగా ఇది వర్తమాన వినియోగ స్వభావం కలిగిన ఖర్చు అని గుర్తు చేసింది. వౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతం మాత్రమే మిగిలిందన్నారు. మార్చి 2017 నాటికి రాష్ట్ర అప్పులను పరిశీలిస్తే 49 శాతం రుణాలను రూ.56,388 కోట్ల రుణాన్ని రాబోయే ఏడు సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. పన్నుల రాబడిలో తిరిగి చెల్లించిన రుణాల శాతం 2015-16లో 7.12 శాతం కాగా ఇది 2016-17లో 32.16 శాతానికి పెరిగిందని కాగ్ గుర్తు చేసింది.
అలాగే 2014-15, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన కేటాయింపుల కంటే అధికంగా అయిన ఖర్చు రూ.6,184 కోట్లను 2017 డిసెంబర్ నాటికి కూడా క్రమబద్ధీకరించలేదని కాగ్ తప్పుపట్టింది. గ్రాంట్లకు మించి ఖర్చు చేసిన కేసులు తీవ్ర ఉల్లంఘనలే కాకుండా శాసనసభ అభీష్టానికి విఘాతం కలిగిస్తాయని ‘కాగ్’ అభిప్రాయపడింది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో మిగులు రూ.31,662 కోట్లకుగాను రూ.49,283 కోట్లు సరండర్ చేయడం వల్ల ఇందులో రూ.41,384 కోట్లు (84 శాతం) ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి31, 2017 సరండర్ చేయడం వల్ల దీని ప్రాధాన్యతా రంగాలకు నిధులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆశించిన అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కాగ్ అభిప్రాయపడింది.

చిత్రం: గురువారం అకౌంటెంట్ జనరల్ (ఏజీ) ఆఫీసులో మీడియాతో మాట్లాడుతున్న కాగ్ అధికారులు