రాష్ట్రీయం

జాప్యం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన రెండుబిల్లులపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం స్వయంగా సమాధానాలు ఇచ్చారు. పంచాయతీరాజ్‌కు సంహబంధించి సమగ్ర చట్టాన్ని తీసుకువచ్చేందుకు వీలుగా బిల్లుపెట్టామని, త్వరలోనే మున్సిపాలిటీలకు సంబంధించి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల చట్టంలో కొన్ని సవరణలు తీసుకువచ్చేందుకు బిల్లును ప్రవేశపెట్టామన్నారు.
గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, సభ్యుల కాలపరిమితి ఈ సంవత్సరం జూలైతో ముగుస్తోందని, చట్టం ప్రకారం మూడునెలల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఈ సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని చట్టం రూపొందించామన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ ప్రభుత్వమే చేయాల్సి ఉంటుందని, నేరుగా ఎన్నికల సంఘమే ఎన్నికలు ప్రకటిస్తే ప్రాక్టికల్ సమస్యలు ఎదరౌతాయన్నారు. ఇలా ఉండగా వచ్చే సంవత్సరం చట్టసభలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 73, 74 వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు అధికారాలు, బాధ్యతలు కల్పించారని, వాస్తవంగా ఇవి అమల్లోకి రాలేదన్నారు. గ్రామపంచాయతీల్లో చాలా వరకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితి ఉందన్నారు.
గత రెండు సంవత్సరాల నుండి సమాజంలోని వివిధ వర్గాల వారితో తమ ప్రభుత్వం చర్చించి తాజా పంచాయతీరాజ్ బిల్లును ప్రతిపాదించిందని కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు, గనుల ద్వారా కొన్ని పంచాయతీలకే నిధులు లభిస్తాయన్నారు. ఇక నుండి ప్రనుత్వం తరఫున గ్రామపంచాయతీలకు 1500 కోట్లు, మున్సిపాలిటీలకు 1000 కోట్ల రూపాయలు ఏటా ఇస్తామన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా రాజేశంగౌడ్‌ను నియమించామని, ఈ కమిషన్ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు నిధులు ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే సర్పంచ్‌లుగా ఉంటారని, మొత్తం 2637 పంచాయతీల్లో గిరిజనులే సర్పంచ్‌లుగా ఉంటారన్నారు. పారిశుద్ద్యం, పచ్చదనం పనులు గ్రామపంచాయతీలు సవ్యంగా నిర్వహిస్తే చాలన్నారు. ఇప్పటి వరకు తాగునీటి సరఫరా బాధ్యత పంచాయతీలపై ఉండేదని, ఇక నుండి మిషన్ భగీరథ అధికారులే తాగునీటి వ్యవస్థను నిర్వహిస్తారన్నారు. మరో మూడు నెలలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలకు కూడా రెండునెలల్లో బల్క్‌గా నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.
గ్రామ పంచాయతీ అంటే కేవలం సర్పంచ్ ఒక్కడే కాదని, ఉపసర్పంచ్, సభ్యులు తదితరులంతా కలిపితేనే గ్రామపంచాయతీ అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. నిబంధనల మేరకు పన్నుల వసూలు చేయడం, కరెంట్ బిల్లులు తదితర బిల్లులను కట్టడం పంచాయతీల బాధ్యతన్నారు. గ్రామ పంచాయతీ కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారని, వీరికి ఓటింగ్ అధికారం మాత్రం ఉండదన్నారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సంయుక్తంగా చెక్కుల పంపిణీ అధికారం ఇస్తామని, పంచాయతీకార్యదర్శులు, పన్నుల వసూళ్లు చేయడంతో పాటు గ్రామ పంచాయతీల నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటందని స్పష్టం చేశారు. ఏదైనా కారణంగా సర్పంచ్‌లను తొలగిస్తే స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎవరినీ వేధించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పంచాయతీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వమే చెల్లించే అంశం పరిశీలిస్తామని కేసీఆర్ తెలిపారు.