రాష్ట్రీయం

ఈ ఏడాది మరో మూడు కీలక ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మార్చి 29: దేశ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నారు. గురువారం షార్ కేంద్రం నుంచి ప్రయోగించి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోలర్ సెంటర్ నుంచి మీడియాకు పలు విషయాలు వెల్లడించారు. ఈ ఏడాది షార్ కేంద్రం నుంచి మరో 9 ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో మూడు శక్తివంతమైన భారీ కీలక ప్రయోగాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇందులో చంద్రయాన్-2 ఒకటన్నారు. ఈ ప్రయోగం అక్టోబరులో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జీశాట్-6 ఏ శక్తివంతమైన ప్రయోగం విజయవంతం కావడంతో దేశంలో మరింత మెరుగ్గా మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఉపగ్రహంలో 5 ఎస్ బాండ్, 1సి బాండ్ బీమ్ ఏర్పాటు చేశామన్నారు. దీంతో దేశానికి మల్ట్భిమ్ కవరేజ్ ఫెసిలిటి ద్వారా మన దేశానికి మొబైల్ కమ్యూనికేషన్ సేవలు అందడమే కాకుండా భారత సైన్యానికి కమ్యూనికేషన్ సర్వీసులు మరింత విస్తృతమవుతాయన్నారు. ఈ రాకెట్ రెండో దశలో రెండు కీలక అంశాలను మెరుగుపరిచామన్నారు. అత్యధిక సామర్ధ్యం గల వికాస్ ఇంజన్, ఎలక్ట్రో మెకానికల్ యాక్చువేషన్ సిస్టమ్‌లను చేర్చినట్లు తెలిపారు. ఉపగ్రత అధారిత మొబైల్ కమ్యూనికేషన్ అఫ్లికేషన్లకు ఉపయోగపడే నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి చక్కని వేదికను ఈ ఉపగ్రహం అందిస్తుందన్నారు. షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ మాట్లాడుతూ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశీయంగా కమ్యూనికేషన్ శాటిలైట్ల తయారీలో ఇస్రో శాస్తవ్రేత్తల నైపుణ్యం ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఈ ప్రయోగం 12వది కాగా స్వదేశీ క్రయోజనిక్ ఇంధనంలో ఇది ఆరో ప్రయోగమన్నారు.
ఉపగ్రహ డైరెక్టర్ వి.రామ్‌నాథన్ మాట్లాడుతూ శివన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ప్రయోగమే విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఉపగ్రహాన్ని అనుకొన్న రీతిలోనే కక్ష్యలోకి విజయవంతంగా చేర్చామన్నారు. మరో 10రోజుల్లో పీఎస్‌ఎల్‌వీ-సి 41 రాకెట్ ప్రయోగం ఉంటుందన్నారు. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్‌కు చెందిన ఐఆర్‌ఎన్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగ విజయం వెనుక అందరి సమష్ఠి కృషి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ డైరెక్టర్ మోహన్, ఎల్‌పి ఎస్‌సి డైరెక్టర్ వి.నారాయనన్, ఐపి ఆర్‌సి డైరెక్టర్ ఎస్.పాండియన్, ఐ ఐ ఎస్‌సి డైరెక్టర్ డి.శామ్ దయాల్‌దేవ్, వెహికల్ డైరెక్టర్ ఎన్‌పి.గిరి, ఐశాక్ డైరెక్టర్ ఎం.అన్నాదురై విజయం మాట్లాడారు.