రాష్ట్రీయం

తిరుమలలో ఘనంగా వసంతోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 29: తిరుమలలోని ఏటా శ్రీవారికి నిర్వహించే వార్షిక వసంతోత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. గురువారం ఉదయం 7గంటల కు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా పడమర వీధిలోని వసంతమండపానికి వేంచేపు చేశారు. అక్కడ మధ్యాహ్నం 4గంటలకు స్వామివారికి, దేవేరులకు అర్చకస్వాములు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నపన తిరుమంజన సమయంలో వేద పండితులు వివిద వేదాలు పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, అలయ డిప్యూటీ ఈఓ హరింధ్రనాథ్, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.