రాష్ట్రీయం

వచ్చే వారం జనసేన అధినేత పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుపై వామపక్షాలతో కలిసి ఐక్య కార్యాచరణ పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వచ్చేవారం ఆంధ్రాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 4వ తేదీన వివిధ పక్షాల నేతలతో మరోసారి సంభాషించి తదుపరి ఉద్యమ కార్యాచరణకు ఒక రూపాన్ని ఇవ్వనున్నట్టు తెలిసింది. ప్రత్యేక హోదా సాధన కోసం జనసేన పార్టీ ఐక్య పోరాటం చేస్తుందని ఇప్పటికే పవన్‌కళ్యాణ్ ప్రకటించారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ మాటలు మారుస్తోందని, బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, వైసీపీ బలంగా పోరాటం చేయలేకపోతోందని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ రాజీ ధోరణితో వ్యవహరిస్తోందని, ఇంత కాలం పనిచేయని వారు ఇపుడు చేస్తారనే నమ్మకం లేదని టీడీపీ ధోరణిపై పవన్‌కళ్యాణ్ ఇప్పటికే మండిపడ్డారు. టీడీపీ రాజీ వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నష్టం జరిగిందని, ఈ విషయంలో వైసీపీ స్పందన నామమాత్రంగానే ఉందని పవన్ ఫీలవుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం తీరుపై కూడా ఆయన పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. ఒక సమ్మిళిత రాజధాని నగరంలా రూపుదిద్దుకోవడం లేదని, అమరావతిని తెలుగు పార్టీకి అనుబంధ నగరంలా తయారుచేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర నుండో రాయలసీమ నుండో వచ్చి ఇమిడిపోయే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఇది సమ్మిళిత రాజధాని కాదు, కొందరికే ప్రత్యేకించిన రాజధాని , ఎవరైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, తాము ఉన్నతులం అనుకుంటే కుదరదని పవన్ వ్యాఖ్యానించారు. 4వ తేదీ భేటీ తర్వాత ఉద్యమం ఏ రూపంలో ఉండాలో ఖరారు చేసి ఆ కార్యక్రమాన్ని తొలుత అనంతపురం నుండి ప్రారంభిస్తారు. ఆ తర్వాత విశాఖ, ఒంగోలులో నిర్వహించి, అనంతరం రాష్టమ్రంతా విస్తరింప చేస్తారు.
గుంటూరులో హెపటైటిస్ సమస్య
గుంటూరులో డయోరియా 23 మందికి పైగా పొట్టన పెట్టుకోగా ఇపుడు వైరల్ హెపటైటిస్ ముగ్గుర్ని బలిగొందని పవన్‌కళ్యాణ్ గురువారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం పరిస్థితి అదుపు తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.