రాష్ట్రీయం

వ్యాగన్ల ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో నిర్మించ తలపెట్టిన రైల్వే వ్యాగన్ల ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ అత్యధిక ప్రాధాన్యతతో కూడిన అంశంగా భావించి రెవెన్యూ అధికారులు వేగంగా భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కె జోషి ఆదేశించారు.
గురువారం సచివాలయంలో రైల్వే ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మెట్రో రైల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్, న్యాయ శాఖ తరఫు నిరంజన్‌రావు, సింగరేణి ఎండి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రూ.380 కోట్ల వ్యయంతో చేపట్టే ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మెదక్, అక్కన్నపేట, మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్లకు భూ సేకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రాచలం, సత్తుపల్లి రైల్వే నిర్మాణ పనులన వేగంగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. రైల్వే మంత్రిత్వశాఖ, తెలంగాణ ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ఒప్పందంపై చర్చించారు. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జిఎం మాట్లాడుతూ చర్లపల్లిలో త్వరలో రాబోయే కొత్త రైల్వే టెర్మినల్‌కు రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని అప్రోచ్‌రోడ్ సదుపాయం కల్పించాలని కోరారు.
అంతేకాకుండా జంటననగరాల్లో అదనపు రైల్వే టెర్మినళ్లను గుర్తించేందుకు రైల్వేతో సంయుక్త సర్వే చేయడానికి కూడా ముందుకు రావాలని కోరారు. రైల్వే ప్రాజెక్టుల వరకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.