రాష్ట్రీయం

ఒంటిమిట్టలో గాలివాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 30: కడప జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అరగంట పాటు ఉధృతంగా వీచిన పెనుగాలలు, వడగండ్ల వానకు కోదండరాముడి ఆలయం పరిసరాలు, కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన రేకులషెడ్లు ఎగిరిపడ్డాయి. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక విద్యుత్ స్తంభాలు, టెంట్లు ఎగిరిపడ్డాయి. ఈ బీభత్సకాండలో నలుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మందివరకు గాయపడ్డారు. ఓ పక్క కోదండరాముడి కల్యాణానికి సమయం దగ్గరపడుతుండగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. కొద్దిసేపటికి అది కాస్త తీవ్రమై భారీ వడగండ్ల వాన కురిసింది. అప్పటికే ఆలయం పరిసరాల్లో ఉన్న వేలాది మంది భక్తులు భయాందోళనతో ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆలయ ప్రాంగణం, మాడావీధులు, గ్రామ పురవీధుల్లో ఏర్పాటుచేసిన స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాల కోసం ఏర్పాటుచేసిన స్తంభాలు ఎగిరిపడ్డాయి. ఇంతలో విద్యుత్ సరాఫరా నిలిచిపోయింది. దీంతో చిమ్మచీకట్లో ఏం జరుగుతోందో తెలియక భక్తులు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన ఫ్యాన్లు, ఏసీ యంత్రాలు ఎగిరిపడ్డాయి. దీంతో భక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. కల్యాణవేదిక వద్దకు తోసుకురావడంతో కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. గాలివానకు కల్యాణవేదిక వద్ద వేసిన రేకులషెడ్లు ఎగిరి పడడంతో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ గుండెపోటుతో మృతి చెందింది. జిల్లాకు చెందిన మరో 48 మంది భక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమ్తితం కడపకు తరలించారు. కల్యాణవేదిక వద్ద రేకులషెడ్లు మీద పడడంతో కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య(60), బద్వేలుకు చెందిన చెన్నయ్య(50) అక్కడికక్కడే మృతి చెందారు. ఒంటిమిట్టకు చెందిన వెంకటసుబ్బమ్మ(60) గుండెపోటుతో మృతి చెందింది. కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణతి మృతి చెందింది.
గాలివానకు ఆలయం లోపల వేసిన షెడ్లు సైతం నేలకొరిగాయి. ఆ సమయంలో గుడిలో ఉన్న భక్తులు భయంతో ఆలయ మధ్యరంగం వద్దకు చేరుకుని శ్రీరాముని స్మరించడం మొదలెత్తారు. రాత్రి 9 గంటల తరువాత వర్షం తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆలయం, కల్యాణవేదిక పరిసరాల్లో గాలికి ఎగిరొచ్చిన రేకులు, టెంట్లు, విరిగిన చెట్లు కనిపించాయి. ఆలయానికి ఇరువైపులా ఉన్న భారీ వేపచెట్లు నేలరాలాయి. ఈ దృశ్యాలు భక్తులను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి.
చిత్తూరు, ప్రకాశం జిల్లాలో....
చిత్తూరు/ ఒంగోలు: చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పంటలు నేలకొరిగి భారీగా నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చిత్తూరు జిల్లా కురబలకోటలో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో పిడుగుపాటుకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. చిత్తూరు జిల్లా గుడుపల్లి, అంగళ్లులో వడగండ్ల వాన కురిసింది. సోమల మండలంలో గాలివాన బీభత్సం సృష్టించడంతో భారీ నష్టం జరిగింది. ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, రోడ్లపై భారీ చెట్లు, ఇంటి పైకప్పులు నేలకొరిగాయి. టమోటా, మామిడి పంట నాశనమైంది. ప్రకాశం జిల్లా కంభం మండలంలో ఈదురుగాలులకు అరటితోటలు నేలకొరిగాయి. మార్కాపురం పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షంతో వీధులు జలమయమయ్యాయి. పట్టణంలో దాదాపు అరగంటపాటు భారీ వర్షం కురవగా రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

చిత్రం: అకాల వర్షంతో ఆటంకాలు తలెత్తినా కోదండరాముడి కల్యాణం కమనీయంగానే సాగింది. కడప జిల్లా ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి కల్యాణం అనంతరం సీతా రాములకు తలంబ్రాలు పోస్తున్న అర్చకులు.