రాష్ట్రీయం

తండాలను తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: గిరిజన తండాలను అద్దాలుగా తీర్చిదిద్దుదామని సీఎం కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. గిరిజన ఉప ప్రణాళికకు ఐదేళ్లలో కేటాయించే దాదాపు రూ. 36 వేల కోట్లతో పేదరికాన్ని శాశ్వతంగా పారద్రోలవచ్చన్నారు. ఇటీవల తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా కొత్తగా 2600 లంబాడి తండాలు, గిరిజన గూడాలతో పాటు ఇతర గ్రామ పంచాయతీలలో రిజర్వు స్థానాలు కలిపి రాష్టవ్య్రాప్తంగా 3 వేల మంది గిరిజనులు సర్పంచ్‌లుగా ఎన్నిక కాబోతున్నారన్నారు. ఒక్కో గిరిజన గ్రామపంచాయతీకి ఉప ప్రణాళిక, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాల ద్వారా ఏడాదికి రూ. 3 లక్షల చొప్పున ఐదేళ్లలో దాదాపు రూ.20 లక్షలు అందుతాయన్నారు. ఇంత పెద్దమొత్తంలో నిధులు రావడం వల్ల లంబాడి తండాలు అద్దాలుగా మారతాయని సీఎం ఆకాంక్షించారు. లంబాడి తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి శాసనసభలో చట్టం చేయడం పట్ల సీఎం కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపడానికి శుక్రవారం ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున గిరిజనలు ప్రగతి భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికల్లో హామీ ఇచ్చి మోసం చేసారన్నారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు తండాలు, గూడేలను పంచాయతీలుగా చేసి హామీ నిలబెట్టుకున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న 3 వేల గిరిజన గ్రామ పంచాయతీలలో ప్రతీ కుటుంబం స్థితిగతులపై అధ్యయనం చేస్తామన్నారు. గిరిజన ఉప ప్రణాళిక కార్యాచరణను ఇక నుంచి గ్రామ పంచాయతీలలోనే తయారు కావాలన్నారు. ‘మా తండా... మా ప్రణాళిక’ కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన కుటుంబ స్ధితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే ఉప ప్రణాళిక సచివాలయంలో కాకుండా గిరిజన గ్రామాల్లోనే తయారు కావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని దేని కోసమైతే పోరాటం చేసామో అది సాకారం అయినప్పుడే సార్ధకం అవుతుందన్నారు. ‘మన ఇంటిని మనమే శుభ్రం చేసుకున్నట్టు, ఎవరికి వారే బాగుపడాలి’ అన్నారు. దీని కోసం ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వేర్వేరుగా కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉందన్నారు. రాష్ట్ర సొంత ఆదాయం దేశంలో మరే రాష్ట్రానికి లేనివిధంగా 22.8 శాతం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది రూ. 15 నుంచి 16 వేల కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందన్నారు. ఇదే విధమైన పురోగతితో తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకుపోతుందన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, కర్నే ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ ఆయన కథ
ప్రగతి భవన్‌లో తనకు కృతజ్ఞతలు తెలుపడానికి వచ్చిన గిరిజనులకు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రొఫెసర్ యూనస్ విజయగాథను సీఎం కేసీఆర్ వివరించారు. ఆరుగురు మహిళలు ప్రతి రోజు ఆరు రూపాయల వడ్డీ చొప్పున కొంత డబ్బు తెచ్చుకొని కూరగాయల వ్యాపారం చేసి ఏ రోజుకారోజు చెల్లించేవారన్నారు. ఈ విషయాన్ని గమనించిన ప్రొఫెసర్ యూనస్, వడ్డీ వ్యాపారికి చెల్లించే దాంట్లో సగం వడ్డీకే తాను డబ్బులు ఇస్తానని మహిళలకు చెప్పడంతో వారు అలాగే చేసారన్నారు. కొంత కాలం పోయిన తర్వాత ఆరుగురు మహిళలను ప్రొఫెసర్ తన ఇంటికి భోజనానికి పిలిచి వారు ఇంతకాలం చెల్లించిన వడ్డీ మొత్తాన్ని వారికే ఇచ్చి ఇకనుంచి ఆ డబ్బుతోనే వ్యాపారం చేసుకోవాలని కోరారన్నారు. అలా ఏర్పడిన ఆరు గ్రూపులు కాలక్రమేణ 17,400 గ్రూపులకు చేరుకున్నాయన్నారు. గిరిజనులు కూడా బంగ్లాదేశ్ ప్రొఫెసర్ యూనస్‌ను స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి స్వయం సమృద్ధిని సాధించాలని సీఎం కేసిఆర్ పిలుపునిచ్చారు.

చిత్రం: గిరిజనులతో సమావేశంలో భాగంగా సంప్రదాయ డప్పు వాయస్తున్న సీఎం కేసీఆర్