రాష్ట్రీయం

అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, మార్చి 30: తాను మరణించినా అవయవదానం ద్వారా మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు లు నింపిన సంఘటన నెల్లూరు నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా వాకాడు మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన రాయపు శ్రీనివాసులు (45) బుధవారం మోటారుబైక్‌పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా తమ హాస్పిటల్‌కు తీసుకొచ్చారని సింహపురి వైద్యశాల చైర్మన్ కా టంరెడ్డి రవీంద్రరెడ్డి తెలిపారు. వైద్యశాలకు వచ్చేటప్పటికీ ఆయన కోమాలోకి వెళ్లిపోయాడని, ఆయన వైద్యానికి స్పందించ లేదన్నారు. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు, వెంటనే శస్తచ్రికిత్స చేయాలని న్యూరోసర్జన్ డా. వెంకటేశ్వరప్రసన్న నిర్ణయించారన్నారు. అనంతరం సతీష్ వందనతో కూడిన బృందం సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం సాయంత్రం న్యూ రాలజిస్టు దీక్షాన్తి నారాయణ్, ఇన్‌సెంటవిస్ట్ నరేష్ బృం దం బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. వారి కుటుం బ సభ్యులతో మాట్లాడి వారు అవయవదానానికి అంగీకరించేలా ప్రయత్నించినట్లు చెప్పారు. ఆయన భార్య వెంకటమ్మ భర్త తరఫున అవయవదానానికి అంగీకరించారని, దీంతో తమ వైద్యశాల వైద్యులు జీవన్‌దాన్ ట్రస్టుకు విషయాన్ని తెలిపి వారి అనుమతితో అవయవదానానికి ఏర్పాట్లు చేశామన్నారు. తమ హాస్పటల్ బృందం శస్తచ్రికిత్స చేసి శ్రీనివాసులు అవయవాలను తొలగించారన్నారు. ఒక కిడ్నీని సింహపురి వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఓ రోగికి అమర్చామని, మరో కిడ్నీని తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందున్న రోగి కోసం పంపామన్నారు. రెండు కళ్లను నగరంలోని మో డ్రన్ వైద్యశాలకు, గుండెను చెన్నైలోని గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు.