రాష్ట్రీయం

45 రైల్వే స్టేషన్లలో ‘వై ఫై’ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లోని 45 రైల్వే స్టేషన్లలో ‘వై ఫై’ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే వెల్లడించింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో ఈ లక్ష్యాన్ని రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు ఇవ్వగా ఒక్క రోజు ముందుగానే సాధించినట్లు తెలిపింది. డి కేటగిరిలోని ఏడు స్టేషన్లు, ఈ కేటగిరిలోని 35 స్టేషన్లకు, ఎఫ్ కేటగిరిలోని 3 స్టేషన్లకు వై ఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే వెల్లడించింది. నిర్ణీత గడువులోగా రైల్వే సిగ్నల్, టెలికం అధికారులు రైల్ టెల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో సహకారంతో వై ఫై ఏర్పాటు చేయడం పట్ల ద.మ.రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఆయా అధికారులు, ఇంజినీర్లను అభినందించారు.
ప్రస్తుతం తమ పరిధిలో ఎ1, ఎ, బి కేటగిరి రైల్వే స్టేషన్లకు మాత్రమే వై ఫై సేవలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు గ్రామీణ ప్రాంత పరిధిలోని స్టేషన్లకు కూడా అందుబాటులో తేవడం జరిగిందని జిఎం వెల్లడించారు.