రాష్ట్రీయం

నేటి నుంచి లేపాక్షి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: కళల కాణాచిగా విరాజిల్లుతూ, అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని సొంతం చేసుకున్న, చారిత్రక ప్రాధాన్యం కలిగిన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతూ నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలు-2018 నేటి నుంచి రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారథ్యంలో చరిత్రలో నిలిచిపోయేలా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శని, ఆదివారాల్లో వివిధ కళారూపాలతో నిర్వహించనున్న గ్రామీణ, సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేయనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ప్రారంభోత్సవ సూచికగా శుక్రవారం సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. రెండోరోజు ఉపముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి పాల్గొంటారు. మొదటిరోజు సురభి పురాణిక్, నృత్యం, శివమణి డ్రమ్స్, మ్యూ జిక్, తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లేపాక్షి నంది విగ్రహం వద్ద 600 మందితో కూచిపూడి నృత్యం ప్రదర్శించనున్నారు. రెండో రోజు అనూప్ రూబెన్స్ బ్యాండ్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏకపాత్రాభినయం ఉం టుంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ జీ.వీరపాండ్యన్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. లేపాక్షిలో వేడుకగా హెరిటేజ్ వాక్
లేపాక్షి: లేపాక్షి నంది ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన హెరిటేజ్ వాక్ వేడుకగా సాగింది. ఉత్సవాల సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంది విగ్రహం నుంచి గురుకుల పాఠశాల వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 3 వేల మం ది విద్యార్థినీ విద్యార్థులు ఈ హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు. భజనలు, కోలాటాలు, గొరవయ్యల నృత్యాలతో అలరించారు. చారిత్రక పురుషులు, స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు అలరించారు.

చిత్రం..లేపాక్షిలో నిర్వహించిన హెరిటేజ్ వాక్