రాష్ట్రీయం

రియల్ బ్రోకర్ బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడికొండూరు, మార్చి 31: పార్లమెంటు సమావేశాల చివరి రోజున వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలంతా రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా పేరేచర్ల సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గత నాలుగేళ్లుగా రాజధానిలో ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించకుండా రియల్‌ఎస్టేట్ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు నేరుగా చినబాబు లోకేష్‌తో మంతనాలు జరుపుతున్నారని, ఈ మార్గంలోనే ఆయనకు డబ్బు సంచులు అందుతున్నాయని ఆరోపించారు. రాజధాని పరిసరాల్లోనే రోజుకు వేల టన్నుల ఇసుకను మాఫియా తరలించుకు పోతుంటే సీఎం తనకేమీ తెలియదని దాటవేయటం దారుణమన్నారు. రైతులకు గజం భూమి లక్ష పలుకుతుందనే కల్లబొల్లి కబుర్లుచెప్పి విదేశాల్లో విలాసాలు చేస్తూ మాయాబజార్ తరహాలో రాజధాని నిర్మాణం చేపట్టారని దుయ్యబట్టారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టారని విమర్శించారు. రైతుల రుణమాఫీ పేరుతో వంచనకు గురిచేశారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎంపీలు హోదా కోసం నిరాహారదీక్ష చేపడితే వారికి మద్దతుగా నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులు కూడా రాష్టమ్రంతటా రిలే నిరాహారదీక్ష చేపడతారని తెలిపారు. విద్యార్థులు, యువకులు కూడా దీక్షబూనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఎలాగూ హోదా రాదనే భావనతో ప్రజలకు ముఖ్యమంత్రి చిత్రాలు చూపుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకరోజు సింగపూర్, మరో రోజు దుబాయ్ చేస్తానని నాలుగేళ్లుగా రాజధాని రైతులకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి ఉందన్నారు. బాబును నమ్మిన రాజధాని రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. అమాయక రైతులకు ప్లాట్లు అప్పగించకుండా కాగితాలు చూపుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ప్లాట్లకు రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ వసతులు కల్పించలేదన్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలన కారణంగా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 180 రూపాయలకు చౌకిడిపోల ద్వారా బియ్యం, కందిపప్పు, నూనె, కిరోసిన్, చింతపండు లాంటి నిత్యావసరాలు అందిస్తుంటే ఇప్పుడు కేవలం బియ్యం మాత్రమే అందుతున్నాయని ఆరోపించారు. కార్డు లబ్ధిదారులకు వేలిముద్ర పడటంలేదనే సాకుతో రేషన్ ఇవ్వటంలేదన్నారు. జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి ఇసుక, పేరేచర్ల కొండల్లో మట్టి అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, మహిళలకు రుణాలు అందజేస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినా వడ్డీ చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సరిపూడి నుండి ప్రారంభమైన పాదయాత్ర మేడికొండూరులో పెద్దమసీదు వద్దకు చేరుకుంది. అక్కడ జగన్ జెండావిష్కరణచేశారు. ప్రజలు తమకు అండగా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తామనే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం పార్టీ కన్వీనర్ ఎన్ క్రిస్టినా, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం: పేరేచర్ల సభలో మాట్లాడుతున్న వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి