రాష్ట్రీయం

నమ్మించి మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం మార్చి 31: రాష్ట్భ్రావృద్ధి, ప్రజాసంక్షేమం, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై తమ పోరు ఆగదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేక హోదా సాధనకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో శనివారం లేపాక్షి-2018 ఉత్సవాలను అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఎదురు చూశామని, కానీ కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. తాను మొదటి నుండి ప్రత్యేక హోదా డిమాండ్ చేశానని, అయితే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటామని కేంద్రం నమ్మించి దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. దీంతో ఢిల్లీకి ఇప్పటి వరకు 29 సార్లు వెళ్లానన్నారు. రాష్ట్భ్రావృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. హేతుబద్దత లేకుండా నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడదీసి అన్యాయం చేస్తే, నేడు కేంద్రంలోని బీజేపీ ఎలాంటి సహాయం చేయకుండా అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదానే మార్గమని రాష్ట్ర ప్రజలు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారని, ఇందుకోసం తాను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి నిర్ణయించుకున్నానన్నారు.
హోదా కోసం పార్లమెంటులో టీడీపీ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారని బాబు అన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రత్యేక హోదా ప్రకటించకపోగా, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ హోదా ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నామన్నారు. బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందుకే కేంద్రం నుంచి బయటకు వచ్చామన్నారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీకి న్యాయం జరుగుతుందని
ఆశించగా నిరాశే మిగిలిందన్నారు. యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ఏన్డీయే ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని బాబు విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అయినా వెనకడుగువేసే ప్రసక్తే లేదన్నారు. ఓవైపు కేంద్రంతో పోరాడుతూనే మరోవైపు రాష్ట్ర అభివృద్దికి ఎలాంటి నష్టం జరుగకుండా సమైఖ్యతతో మెలుగుదామని సీఎం పిలుపునిచ్చారు. న్యాయమైన రాష్ట్ర హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని సీఎం కోరారు. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఆగదన్నారు. భావితరాల కోసం ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సహకరించకపోయినా, నాటకాలాడినా మడమ తిప్పేది లేదన్నారు.
బీజేపీ, వైకాపా, జనసేన పార్టీల వ్యవహార శైలిని బాబు దుయ్యబట్టారు. తాను చేస్తున్న పోరు న్యాయంమైందైతే గట్టిగా కేకలు వేసి మద్దతివ్వండి, చప్పట్లు చరచండి అని ప్రజలకు సూచించారు. దీనికి ప్రజల నుండి మంచి స్పందన రావడంతో సీఎం మరింత హుషారుగా ప్రసంగించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పిన బీజేపీ ప్రస్తుతం తీరని అన్యాయం చేస్తోందన్నారు. అమరావతి, తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి అన్ని విధాల న్యాయం చేస్తామని చెప్పి ప్రస్తుతం మోసగించడం తగదని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం అన్నారు. నాలుగేళ్ల పాటు తమతో మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉన్నఫళంగా యూటర్న్ తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇందులో రాజకీయ దురుద్దేశమే తప్ప మరొకటి లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయగా బీజేపీ, వైకాపా, జనసేనపార్టీలు హాజరు కాకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోసం తాను న్యాయమైన పోరాటం సాగిస్తుంటే ఆయా పార్టీలు రాష్ట్రానికి మరింత అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేస్తామని, విశాఖ రైల్వేజోన్ ఇస్తామని, కడపకు ఉక్కు కర్మాగారం, దుగ్గిరాలపట్నంలో కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఐదో వార్షిక బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపిందన్నారు. రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా తనకు అండగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు.

చిత్రం: ప్రఖ్యాత సినీ దర్శకులు కె.విశ్వనాథ్‌ను సన్మానిస్తున్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ