రాష్ట్రీయం

వైఫల్యాలపై శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31:ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ మలి విడత బస్సు యాత్ర ఆదివారం (ఏప్రిల్ 1) నుంచి ప్రారంభంకానున్నది. మార్చిలో బస్సు యాత్రను చేవెళ్ళ నుంచి ఆరంభించినా, ఎఐసిసి ప్లీనరీ,అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాల దృష్ట్యా తాత్కాలికంగా దానికి బ్రేకు పడిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ, కౌన్సిల్‌లు నిరవధికంగా వాయిదా పడినందున టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మలి విడత బస్సు యాత్ర ప్రారంభంకానున్నది. చేవెళ్ళ నుంచి నుంచి ప్రారంభమైన తొలి విడత బస్సు యాత్రలో 17 నియోజకవర్గాల్లో నిర్వహించగా, ఈ దఫా 10 రోజుల పాటు 18 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగనున్నది. ఈ దఫా ఏప్రిల్ 1న సాయంత్రం 6 గంటలకు బస్సు యాత్రను రామగుండంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం రాత్రి అక్కడే బస చేసి, మర్నాడు 2వ తేదీన పెద్దపల్లికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. 3న మంథనిలో మధ్యాహ్నం 2 గంటలకు, భూపాల్‌పల్లిలో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. బుధవారం స్టేషన్ ఘన్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు, పాలకుర్తిలో సాయంత్రం 6 గంటలకు, గురువారం సాయంత్రం 5 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పరకాల, సాయంత్రం 6 గంటలకు పశ్చిమ వరంగల్, ఏప్రిల్ 7న మధ్యాహ్నం 2 గంటలకు ఇల్లెందులో సాయంత్రం 6 గంటలకు, 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు డోర్నకల్‌లో సాయంత్రం 6 గంటలకు, ఏప్రిల్ 9న భద్రాచలంలో రామలయాన్ని దర్శించుకుని అనంతరం వెంకటాపూర్‌లో పార్టీ నాయకులతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు ములుగులో సభ జరుగుతుంది. 10న మధ్యాహ్నం 2 గంటలకు వర్ధన్నపేట, సాయంత్రం 6 గంటలకు వరంగల్ తూర్పులో సమావేశాలు జరుగుతాయని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిఆర్‌వో కె. హరి ప్రసాద్ తెలిపారు.