రాష్ట్రీయం

రాజ్‌భవన్ ఖర్చు వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ. 21.17 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలో రాజ్యాంగ సంరక్షకుడు గవర్నర్ నివసించే రాజ్‌భవన్ ఖర్చులు, గవర్నర్ జీత భత్యాల కింద తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ.21,17,55,000 కోట్లను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఉండడం వల్ల ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చును భరిస్తుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ద్వారా రెండు రాష్ట్రప్రభుత్వాలు జనాభా నిష్పత్తి ప్రకారం ఖర్చును భరించాలి. హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల రెండు రాష్ట్రాలు పదేళ్ల పాటు ఈ ఖర్చును భరించాల్సి ఉంటుంది. సాధారణంగా గవర్నర్ నివసించే రాజ్‌భవన్ లాగే ఆయన జీత భత్యాలపై ప్రతి పౌరుడికి ఆసక్తి ఉంటుంది. గవర్నర్ జీత భత్యాల కింద సాలీనా రూ. 1.10 కోట్లను కేటాయించారు. సచివాలయ సిబ్బందికి 9.38 కోట్లను కేటాయించారు. గ్రాంట్ల కింద రూ.10 లక్షలు, గృహ నిర్వాహక సిబ్బందికి రూ.8.10 కోట్లు, గవర్నర్ కుటుంబం, సిబ్బంది వైద్య సదుపాయాల కింద రూ.98.71 లక్షలు, వినోదపు ఖర్చులు, హాస్పిటాలిటీ ఖర్చులు కింద రూ. 1.03 కోట్లు, కాంట్రాక్టు భత్యాల నుంచి ఖర్చు రూ.10 లక్షలు, పర్యటన కింద రూ.12.50 లక్షలు, ఇతర ఖర్చులు అంటే ఫర్నిచర్ నిర్వహణ, రాజ్‌భవన్ ఉద్యానవనాల కింద రూ.24.20 లక్షలను కేటాయించారు.