రాష్ట్రీయం

నయనానందకరం.. కోదండరాముడి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, మార్చి 31: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి రథోత్సవం శనివా రం నయనానందకరంగా సాగింది. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నా రు. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి కల్యాణం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడి ఉత్సవమూర్తులను అందం గా అలంకరించి ప్రత్యేక పూజల అనంతరం శుభ గడియల్లో రథంలో ఆసీనులను చేయించారు. 10.40 గంటల ప్రాంతంలో ప్రత్యేక పూ జలు, హారతులు ఇచ్చిన అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ రథం ముందుకుసాగింది. ఆలయ మాడావీధుల్లో సాగిన రథోత్సవాన్ని తిలకించేందకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహిస్తారు. స్వామివారు కాళీయమర్దన అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.