రాష్ట్రీయం

న్యాయవ్యవస్థలో మగవారిదే ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: దేశంలో మహిళా రక్షణకు లెక్కలేనన్ని చట్టాలున్నా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఓబీసీ ఉప వర్గీకరణ జాతీయ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ జీ రోహిణి పేర్కొన్నారు. రెండు రోజులుగా జ రుగుతున్న జాతీయ న్యాయ సంస్కరణల సద స్సు ముగింపు రోజు ఆమె మాట్లాడుతూ న్యా యవ్యవస్థ ఒక విధంగా మగవారి ఆధిపత్యంలోనే ఉందని, దిగువస్థాయి న్యాయస్థానాల్లో న్యాయాధికారులుగా పెద్దసంఖ్యలో మహిళలు ఎంపిక పరీక్షలు, ప్రతిభ ఆధారంగా వస్తున్నార ని, అదే ఉన్నత న్యాయస్థానాల్లో మాత్రం అంత నిష్పత్తిలో న్యాయమూర్తులు రావడం లేదని ఆ వేదన వ్యక్తం చేశారు. ప్రతిభకు పట్టం కడితేనే ఉన్నత న్యాయస్థానాల్లో సైతం పెద్దఎత్తున మహిళా న్యాయమూర్తులు వస్తారని అన్నారు. ఏ బాధ్యత అప్పగించినా విజయవంతంగా మ హిళలు పూర్తిచేస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న కేసులు సైతం అపరిష్కృతంగా ఉండటం లేదా వాటి పరిష్కారానికి ఐదారేళ్లు పట్టడం శోచనీయమన్నారు. న్యాయవ్యవస్థ మాత్రమే అన్నింటికీ పరిష్కారం కాబోదని, సమాజంలోనూ, ఇ తర వ్యవస్థల్లోనూ మార్పు రావాలని ఆమె చె ప్పారు. చాలా చట్టాలకు కాలం తీరిపోయిందని వాటిని వినియోగించుకోవడం వల్ల వ్యాజ్యాలు పెరుగుతున్నాయని అన్నారు. చిన్న చిన్న సమస్యలకు ప్రభుత్వ అధికారుల వద్దకు ప్రజలు వెళ్లినపుడు వారు పట్టించుకుని వాటిని పరిష్కరిస్తే అవి కేసుల రూపం దాల్చబోవని అన్నారు. సమాజంలో అవినీతిని కళ్లు మూసుకుని చూడకూడదని, వాటిని అడ్డుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. రెండోరోజు ఉన్నత న్యాయవ్యవస్థలో పారదర్శకత, న్యాయస్థానాల్లో మహిళా సాధికారత అంశాలపై జరిగిన చర్చలో జీ విద్యాసాగర్, అపరాజిత శర్మ, దీపక్ భట్టాచార్య, డీవీ సీతారామశర్మ, పీ వేణుగోపాల్, కౌటూరి వినయ్ కుమార్, నంద మాట్లాడారు. తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన దామోదర్‌రెడ్డిని జస్టిస్ రోహిణీ, డాక్టర్ కోక రాఘవరావు సత్కరించారు.