రాష్ట్రీయం

ఎలాంటి బెదిరింపులూ రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎవరి నుండి తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ పొదిలి అప్పారావు పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ అప్పారావును హత్య చేసేందుకు వ్యూహరచన జరిగిందని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చేసిన ప్రకటనపై ప్రొఫెసర్ అప్పారావు స్పందించారు. చందన్‌మిశ్రా, పృథ్వీరాజ్ అనే యువకులను పోలీసులు అరెస్టు చేయగా, వారిచ్చిన సమాచారం మేరకు కుట్ర జరిగినట్లు తూర్పుగోదావరి పోలీసులు పేర్కొన్నారని, అయితే తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని అప్పారావు తెలిపారు.
భద్రతకు ఇద్దరు గన్‌మెన్‌లు
సెంట్రల్ యూనివర్శిటీలో గతంలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల మృతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు వైస్ చాన్సలర్ అప్పారావుకు 1+1 గన్‌మెన్‌ల భద్రతను కల్పించడం జరిగిందని సైబరాబాద్ కమిషనర్ తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఆయనకు కల్పించింది గానీ, బెదిరింపుల వల్ల గానీ కాదని స్పష్టం చేశారు.