రాష్ట్రీయం

ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర శనివారం ఘనం గా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద రాత్రి 8 గంటల సమయానికి శోభాయాత్ర ముగిసింది. భారీ భద్రత నడుమ భక్తుల జై హనుమాన్ నినాదాలతో హనుమాన్ ఊరేగింపు కొనసాగింది. తొలుత కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వచ్చిన హనుమాన్ ఊరేగింపు గౌలిగూడ వద్దకు చేరుకోగానే అక్కడి నుంచి ప్రధాన ఊరేగింపు 11.30 గంటలకు ప్రారంభమైంది. గౌలిగూడ, కోఠి, సుల్తాన్‌బజార్, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, సికింద్రాబాద్, మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి హనుమాన్ శోభాయాత్ర చేరుకుంది. అక్కడితో యాత్ర ముగిసింది. దారిపొడవునా వివిధ కాలనీలు, ప్రాంతాల నుంచి అనేక హనుమాన్ ఊరేగింపులు ఈ ప్రధాన ఊరేగింపులో కలవడం ద్వారా భారీ భక్త జనసందోహం కదిలింది. నగరంలోని అన్ని ప్రాంతాలు కాషాయ జెండాలతో కళకళలాడింది. నిర్వాహకులు అనుకున్న సమయానికి తాడ్‌బండ్ ఆలయానికి శోభాయాత్ర తీసుకు వచ్చి ముగించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని రకాల పోలీసు దళాలను రంగంలో దింపారు. భద్రతకు దాదాపు 12 వేల మంది పోలీసులను మోహరింప చేశారు. అనుమానితులపై స్పెషల్ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి నిఘాను తీవ్రతరం చేశారు.