రాష్ట్రీయం

పూడుకుపోతున్న పుష్కర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం అఖండ గోదావరి నది ఎడమగట్టుపై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆధునికీకరణ పనులు లేకపోవడం వల్ల పూడుకుపోతోంది. పుష్కర ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు దాదాపు 200 మీటర్ల దూరం వరకు గోదావరి నీరు అందడం లేదు. పంపుహౌస్ వద్ద పూడుకుపోయింది. దీంతో గత కొద్ది రోజులుగా జల వనరుల శాఖ అధికారులు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. పూడిక తీసి పంపుహౌస్ వరకు నీరు చేరే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ పంపుహౌస్‌కు నీరందని స్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గోదావరి ఎండిపోయింది. ప్రస్తుతం పంపుహౌస్‌కు నీరు చేరడం లేదు. ప్రతీ ఏటా ఈ పథకం ద్వారా వేసవికాలంలో మెట్ట ప్రాంతంలోని చెరువులకు నీటిని విడుదల చేస్తారు. మెట్ట ప్రాంతంలో రబీ పంట సాగుకు, పశువులకు, ప్రజలకు తాగునీటికి ఈ పథకాన్ని ఉద్ధేశించారు.
తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని 13 మండలాల పరిధిలో 1.86 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఉద్ధేశ్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. పంపుహౌస్ వద్ద నీటి మార్గం పూడుకుపోయింది. వేసవి కాలంలో కాలువల వ్యవస్థను, పంపుహౌస్ మరమ్మతు పనులతో ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఎక్కడా అటువంటి జాడ కనిపించడం లేదు. ప్రధాన కాలువల వ్యవస్థ ఎక్కడికక్కడ పూడుకుపోయింది. నిర్వహణా లోపం వల్ల కాలువలు పూడుకు పోవడంతో సాగునీరు, తాగునీరు లక్ష్యాల మేరకు శివారు ప్రాంతాలకు వెళ్లడం లేదు. దీనికి తోడు ఆవిరి నష్టాలు అధికమయ్యాయి. పంపుహౌస్‌కు గోదావరి నది నీరు చేరే విధంగా మాత్రం అధికారులు పూడిక తీత పనులు చేపట్టారు. వేసవిలో ఎండలు తీవ్రమవుతోన్న తరుణంలో మెట్ట ప్రాంతంలోని 324 చెరువులకు పుష్కర ఎత్తిపోతల ద్వారా నీరు అందించాల్సి వుంది. చెరువులకు నీరు చేరకపోతే లక్షలాది పశువుల దాహార్తి తీర్చేందుకు దారిలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీ సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించే సమయంలో మెట్ట ప్రాంతంలోని వరి, మొక్కజొన్న, దుంప, కంది, మినుము, పెసలు తదితర పంటలకు చెరువుల ద్వారా సాగునీరు వినియోగిస్తున్నారు. ఈ ఏడాది గోదావరి నదిలో నీరు లేకపోవడం వల్ల జల వనరుల శాఖ ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో అర్ధంకాక ఎదురుచూస్తోంది. మెట్ట ప్రాంతంలోని చెరువులకు నీరు కావాలని రైతులు కోరుతున్నారు. వేసవిలో ప్రతీ ఏటా మెట్ట ప్రాంతంలోని చెరువులకు రెండు టీఎంసీల నీటిని పుష్కర ఎత్తిపోతల నుంచి సరఫరా చేస్తున్నారు. ఇప్పటికొచ్చి ఈ రెండు టీఎంసీల నీరు కూడా విడుదల చేసే అవకాశం గోదావరి నదిలో కనిపించలేదు. దీనికి తోడు పుష్కర వ్యవస్థ కాస్తా పూడుకుపోయింది కాబట్టి ఒక వేళ నీరు వదిలినా చెరువులకు చేరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో మెట్ట ప్రాంతంలోని గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, పెద్దాపురం, గండేపల్లి, రంగంపేట, కిర్లంపూడి, పిఠాపురం, తుని మండలాల్లో ఈ ఏడాది తీవ్ర నీటి ఎద్దడి తప్పేట్టు లేదని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగితే తప్ప పుష్కరకు నీటిని అందించలేని స్థితి నెలకొంది.
పుష్కర ఎత్తిపోతల పథకాన్ని రూ.608 కోట్లతో నిర్మించారు. లక్షా 85వేల 906 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. పథకం పూర్తయి ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ లక్ష్యం మేరకు సాగునీరు అందించలేదు. లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ లక్షా ఇరవై వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. దీనికి తోడు సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు. ఈ ఏడాదైనా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేయాల్సి ఉందని కోరుతున్నారు.