రాష్ట్రీయం

రాష్ట్రంలో రాజకీయ వేడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 1: ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన, వైకాపా ఎంపీలు రాజీనామా చేసేందుకు నిర్ణయించడం వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం గురించి రాష్ట్ర శాసనసభలో వివరించి, అనంతరం రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమల్లో కేంద్రం వహిస్తున్న తీరును వివిధ రాజకీయ పార్టీల నేతలకు వివరించి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తరువాత ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఆరుగురు సభ్యుల బృందంతో ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలవనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నారు. సెలవుల అనంతరం సోమవారం ఉదయానికి ఎంపీలు ఢిల్లీ చేరి, వివిధ పార్టీల నేతలతో భేటీపై స్పష్టత తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ మినహా మిగిలిన పక్షాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ 3, 4 తేదీల్లో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి జరిగిన నిధుల కేటాయింపు, హామీలో అమల్లో కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరించనున్నారు. కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకూ ఆయన ఈ పర్యటనను ఉపయోగించుకోనున్నారు. తృతీయ
ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించిన టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీతోనూ తాజా రాజకీయాల పరిణామాలపై ఆయన చర్చించి, మద్దతు కోరనున్నారు. మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసు సోమవారం ఇవ్వనున్న నేపథ్యంలో ఆరోజు ఉదయం అందుబాటులో ఉన్న ఎంపీలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాగా, హోదా అంశంపై వైకాపా ఎంపీలు పార్లమెంట్ సమావేశాల చివరిరోజు రాజీనామా చేస్తారని, ఆ తరువాత ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సభ్యులు కేంద్రం చేసిన సాయాన్ని విపులంగా వివరించి, రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.