రాష్ట్రీయం

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 1: మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, తమిళనాడు మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ తుపాను పరిశోధన కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. ఇప్పటికే దీని ప్రభావంతో రెండు రోజులుగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం ద్రోణి తెలంగాణ పరిసర ప్రాంతాల్లో బలంగా ఉందని, దీని ప్రభావంతో తెలంగాణ, సమీప దక్షిణ కోస్తా జిల్లాలైన గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వానలుపడే అవకాశం ఉందన్నారు. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో శనివారం కూడా సాధారణ ఉష్ణోగ్రతలే నెలకొన్నాయి. అనంతపురంలో మాత్రం సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కర్నూలులో ఒక డిగ్రీ అధికంగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో తిరుపతి 38 డిగ్రీలు, గన్నవరం, నెల్లూరులో 36 డిగ్రీలు, విశాఖపట్నం, కావలి, ఒంగోలు, మచిలీపట్నంలో 35 డిగ్రీలు, తుని, కాకినాడల్లో 34 డిగ్రీలు, కళింగపట్నం, నర్సాపురం, బాపట్లలో 33 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చిత్రం..ఆదివారం సాయంత్రం భాగ్యనగరాన్ని ముంచేసిన భారీ వాన