రాష్ట్రీయం

కేసీఆర్ అనర్హుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఏప్రిల్ 1: తెలంగాణ ఆవిర్భావం తరువాత కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన అన్నివర్గాల ప్రజానీకాన్ని నిలువునా మోసం చేసిన కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతికహక్కు లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెగేసి చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో ఆదివారం రాత్రి ప్రారంభమైన మూడవ విడత కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర భారీ బహిరంగ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణను పూర్తిస్థాయి అప్పుల ఊబిలో ముంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని పదే పదే ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్, రాష్ట్రంలో దర్జాగా కుటుంబ పాలన కొనసాగిస్తున్నారన్నారు. తెరాస అవినీతి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఇక అనైతిక పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి గని కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని, కంపెనీలో వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ మోసం చేశాడని దుయ్యబట్టారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా బొగ్గు గనులు తీసుకు వస్తానని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం ఎన్ని తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలతో తెరాస బడ్జెట్ ప్రవేశ పెట్టిందని, అవినీతి పాలనను నిలదీస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ కాంగ్రెస్‌దేనని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. అన్ని పంటలకు బీమా కల్పిస్తామని, మద్దతు ధరలు అనుకున్న దానికిమించి పెంచుతామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 3వేల భృతి కల్పిస్తామని, మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయల రుణం ఇప్పిస్తామని ప్రకటించారు. సభలో తెలంగాణ ఇన్‌ఛార్జి కుంతియా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మోసపు మాటలతో కాలం వెళ్లదీస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పటిస్తున్న కేసీఆర్ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. సభలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, దుద్దిళ్ల శ్రీ్ధర్ బాబు, రేవంత్ రెడ్డి, జీవన్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్, హర్కార వేణుగోపాల్ రావు, పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, ఆరెపల్లి మోహన్, సుధాకర్ రెడ్డి, మల్లు రవి, జనక్ ప్రసాద్, బడికెల రాజలింగంతోపాటు వేలాదిగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

చిత్రం..నేతలతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్న ఉత్తమ్‌కుమార్