రాష్ట్రీయం

ఈ ఇళ్లు ఇంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ ప్రాజెక్టుకు చేసిన అప్పు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు పెనుభారంగా మారింది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు లాభాపేక్ష లేకుండా నిర్మాణ వ్యయానికే ఇళ్ము నిర్మించి ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన రాజీవ్ స్వగృహ పథకం ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నుంచి చేసిన రూ. 1000 కోట్ల రుణానికి రూ. 400 కోట్ల వడ్డీని చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడింది తప్ప కనీసం పూర్తి చేసిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేని దుస్థితిలో గృహ నిర్మాణ శాఖ ఉంది. తాజాగా ఈ అంశంపై శాసనసభలో విపక్షాలు నిలదీసినా సహేతుక సమాధానాన్ని ప్రభుత్వం చెప్పలేకపోయింది. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వడ్డీల రూపేణ చెల్లించడానికి కూడా సిద్ధపడిన ప్రభుత్వం, కనీసం పూర్తి చేసిన ఇళ్లను కొనుగోలు చేయడానికి
ముందుకు వచ్చిన వారికి కేటాయించడంపై దృష్టిసారించలేక పోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హయాంలో ఆగస్టు 2007లో ఆంధ్రప్రదేశ్ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు అయింది. అప్పట్లో రాష్టవ్య్రాప్తంగా రాజీవ్ స్వగృహ పథకం కింద ఇళ్లను నిర్మించడానికి భూ సేకరణ జరిపి గృహ నిర్మాణాలను చేపట్టింది. ఇందులో భాగంగా రెండు పెద్ద యూనిట్లను రంగారెడ్డి జిల్లా (ప్రస్తుతం మేడ్చెల్ జిల్లా) బండ్లగూడ, పోచారంలో చేపట్టింది. బండ్లగూడలో 26.26 ఎకరాల విస్థీర్ణంలో 2746 ఫ్లాట్లను రూ.460 కోట్ల వ్యయంతో, పోచారంలో 30 ఎకరాల విస్థీర్ణంలో 2604 ఫ్లాట్లను రూ.405 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తుల ఫ్లాట్లను నిర్మించింది. ఇందులో బండ్లగూడలో 506 ఫ్లాట్లను, పోచారంలో 180 ఫ్లాట్లను పూర్తి చేసి దరఖాస్తుదారులకు కేటాయించింది. బండ్లగూడలో పూర్తి అయిన ఫ్లాట్లు 309, అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్లు 1931, పోచారంలో పూర్తి అయిన ఫ్లాట్లు 968, అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్లు 502 ఉన్నాయి. నిర్మాణ వ్యయానికే దరఖాస్తుదారులకు అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు గండికొట్టారు. బయట మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ధరల కంటే ప్రభుత్వ ఫ్లాట్ల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకురాలేదు. తెలంగాణ ప్రభుత్వం తొలినాళ్లలోనే ఆన్‌లైన్ ద్వారా ఈ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టగా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. బయటి ధరల కంటే ప్రభుత్వ ధర ఎక్కువగా ఉండటం వల్లనే ఎవరు ముందుకు రాలేదని అధికారులు ప్రభుత్వానికి కారణాలను నివేదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చి మార్కెట్ కంటే కాస్తో కూస్తో తక్కువ ధరను ఖరారు చేసి తమకు కేటాయిస్తే కొనుగోలు చేస్తామన్నారు. దీంతో బండ్లగూడలో పూర్తి అయిన ఫ్లాట్లకు చదరపు అడుగుకు రూ.1900, అసంపూర్తిగా ఉన్న ఫ్లాట్లకు చదరపు అడుగుకు రూ.1700, పోచారంలో పూర్తి చేసిన ఫ్లాట్లకు చదరపు అడుగుకు రూ.1700, అసంపూర్తి ఫ్లాట్లకు చదరపు అడుగుకు రూ. 1500 ధర ఖరారు చేసింది. రెండవసారి ఆన్‌లైన్ ద్వారా ఈ ఫ్లాట్ల అమ్మకానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ ద్వారా ప్రత్యేక అప్లికేషన్‌ను తయారు చేయించి దరఖాస్తులనస స్వీకరించింది. గత ఏడాదిలోనే ఈ ప్రక్రియ పూర్తి అయినా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. చేసిన అప్పుకు వడ్డీ, చక్ర వడ్డీని చెల్లిస్తూ కూడా పూర్తి చేసిన ఇళ్లను దరఖాస్తుదారులకు కేటాయించలేని దుస్థితిలో గృహ నిర్మాణ శాఖ ఉండిపోయింది.