రాష్ట్రీయం

కాలితో కాన్వాస్ పెయింటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 1: కాలితో భారీ కాన్వాస్‌పై పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డు సాధించిన మాగంటి జాహ్నవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అభినందించారు. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి ఉండవల్లి నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసింది. పిన్న వయస్సులోనే వినూత్న తరహాలో పాదంతో భారీస్థాయి పెయింటింగ్ వేసి గిన్నిస్ రికార్డు పుస్తకంలో పేరు నమోదు చేయించుకున్నందుకు జాహ్నవిని చంద్రబాబు ప్రశంసించారు. సృజనాత్మకతతో ఊహల్లో భావన చేసి, దాన్ని వాస్తవం చేయడంలో విజయం దాగి ఉందని ఆయనన్నారు. మనసు పెట్టి సాధన చేస్తే జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ లేదని అన్నారు. గతంలో 100 చదరపు అడుగుల మేర ఉన్న గిన్నిస్ రికార్డును అధిగమించి 140 చదరపు అడుగులకు పైగా టెన్నిస్ కోర్టు సగభాగంలో పాదంతో మూడు గులాబీ పువ్వులు, ఆకులు, బ్యాక్‌గ్రౌండ్ పచ్చదనంతో నింపి పెయింటింగ్ వేయడంలో సఫలీకృతమైన తీరు ప్రశంసనీయమని ఆయన కితాబిచ్చారు. కాలితో పెయింటింగ్ వేయడంలో ప్రావీణ్యం సాధించడం అందరికీ సాధ్యంకాని గొప్ప విషయమన్నారు. అరుదైన పెయింటింగ్‌తో పొందిన అనుభవాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తే విస్తృతమైన అవకాశాలు లభిస్తాయన్నారు. బ్రిటన్‌లో విద్యాభ్యాసం ముగిసిన తర్వాత మనదేశంలో సేవలు అందించడానికి ప్రాధాన్యమివ్వాలని జాహ్నవికి సూచించారు. పెయింటింగ్‌లో మరింత సాధన చేసి మరెన్నో ప్రయోగాలకు నాంది పలకాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి దంపతులు జాహ్నవికి జ్ఞాపిక అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. 18ఏళ్ల జాహ్నవి ప్రస్తుతం బ్రిటన్‌లో యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్‌లో బీఎస్సీ చదువుతోంది. పెయింటింగ్‌లో ఉన్న అనుభవాన్ని మరింత సానబట్టి రికార్డులు సృష్టించటంపై ధ్యాసపెట్టింది. వినూత్న రికార్డుకు నాంది పలికింది. హైదరాబాద్‌లోని లాంకో హిల్స్‌లో అందరి ముందు టెన్నిస్ కోర్టులో 140 చదరపు అడుగుల మేర మూడు గులాబీ పువ్వులు, మూడు ఆకులు, పచ్చదనంతో కాన్వాస్‌పై భారీ పెయింటింగ్ వేసి అబ్బురపర్చింది. ఆ సందర్భంలో చిత్రీకరించిన వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు పంపారు. జాహ్నవి శ్రమను, పెయింటింగ్‌లో ప్రావీణ్యాన్ని గుర్తించినట్లు గిన్నిస్ రికార్డ్స్ సంస్థ సర్ట్ఫికెట్ అందించింది.
చిత్రాలు.. జాహ్నవికి జ్ఞాపిక అందజేస్తున్న చంద్రబాబు.
*జాహ్నవి కాలితో వేసిన పెయింటింగ్