రాష్ట్రీయం

కాళీయమర్దనుడిగా కోదండరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 1: ప్రసిద్ధ రామాలయాల్లో విశిష్టస్థానం సంపాదించి ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం స్వామివారు కాళీయ మర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శ్రీ సీతారాములు అశ్వవాహనంపై ఆశీనులై మాడవీధుల్లో విహరించారు. ముందుగా అర్చకులు సుప్రభాత సేవ, ఆలయ శుద్ధి, ఆరాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీకోదండరామస్వామి ఉత్సవమూర్తికి కాళీయ మర్ధన అలంకారం రూపంలో పట్టువస్త్రాలను అలంకరించి సంప్రదాయం ప్రకారం ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఊరేగింపులో కోలాటాలు, కేరళ వాయిద్యాలు, భక్తుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీసీతారాముల ఉత్సవమూర్తులకు స్తప్న తిరుమంజన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవమూర్తులకు సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేశారు. విశ్రాంతి కార్యక్రమంలో భాగంగా సాయంత్రం అలంకార మండపంలో శ్రీసీతారామలక్ష్మణులకు ఊంజల్‌సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీసీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులకు చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.

చిత్రం..అశ్వవాహనంపై సీతారాములు