రాష్ట్రీయం

బ్రిటిష్ పాలనను తలపిస్తున్న మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఏప్రిల్ 1: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ విభజించు పాలించు పద్ధతిలో బ్రిటిష్ తరహా పాలనా విధానాన్ని అనుసరిస్త్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాడని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. సీపీఎం 21 అఖిల భారత మహాసభల ప్రచారం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని గాంధీపార్క్‌లో నిర్వహించిన ‘మతోన్మాదం-జాతీయ సమగ్రతకు ఎదురవుతున్న సవాళ్లు’ అన్న అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు సాగిస్తూ రాజ్యంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ సైతం మోదీ బాటలోనే సాగుతూ మతపరమైన ఓట్లకోసం గుళ్లు గోపురాలు తిరుగుతున్నారన్నారు. బీజేపీ గోసంరక్షణ విధానాలతో 12లక్షల మంది వ్యాపారులు రోడ్డునపడగా, గోరక్షక దళాలు సాగించిన హింసాకాండకు దేశ వ్యాప్తంగా వందలాదిమంది బలయ్యారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో వైద్యులకు బదులుగా స్వామీజీలను పెడుతూ ఆరోగ్య పరీక్షలను చేతిరేఖలు చూసి చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. త్రిపురలో గెలుపుకోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయగా, కాంగ్రెస్ అక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందన్నారు. సీపీఎం శ్రేణులపై దాడులకు పాల్పడుతు పార్టీ అణచివేతకు ప్రయత్నిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న ఎర్రజెండాను ఎవరూ నిర్వీర్యం చేయలేరన్నారు. మోదీ పాలనలో అన్నివర్గాలు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మహారాష్ట్ర రైతాంగం సాగించిన పాదయాత్ర తరహా రైతు ఉద్యమాలు సాగిస్తేనే ప్రభుత్వాలు రైతాంగ సమస్యలపై దృష్టి సారిస్తాయన్నారు. రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలన్నీ విఫలమయ్యాయన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులను, లౌకికవాద పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు సీపీఎం కృషి చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పార్లమెంటు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం బీజేపీ పట్ల ద్వంద్వ విధానాలు పాటిస్తుందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీకి సహకరించిందని ఆరోపించారు. సామాజిక న్యాయం, లౌకిక పాలన సాధనకు సీపీఎంను ప్రజలు బలపరచాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ముల్కలపల్లి రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు స్వరాజ్యం, మల్లు లక్ష్మి, మల్లు వెంకటనరసింహారెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సూర్యాపేటలో ‘మతోన్మాదం-జాతీయ సమగ్రతకు ఎదురవుతున్న సవాళ్లు’ అన్న అంశంపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడుతున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్