రాష్ట్రీయం

మతతత్వ శక్తులపై ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 1: ఆర్‌ఎస్‌ఎస్, ఇతర మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేవారిని సమీకరించి ఉద్యమిస్తామని, వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా కలసివచ్చే శక్తులతో కలిసి పనిచేస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ చెప్పారు. టీఆర్‌ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లకు దూరంగా ఉంటామని తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆదివారం జరిగిన ఒక సదస్సులో ఆమె మాట్లాడుతూ గత నాలుగేళ్లలో దేశంలో ధనవంతులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని కాజేసేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. గిట్టుబాటు ధరలు లేక, పంటలు సరిగ్గా పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి వ్యవసాయ రుణాలను రద్దుచేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రత్యామ్నాయం కోసం కలసివచ్చే శక్తులను కలుపుకుపోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్, మమతాబెనర్జీ కలిసి ఫ్రంట్ అంటున్నారని, వారి విధానాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఇది గమనించాల్సిన అవసరం ఉందన్నారు. త్రిపురలో సీపీఎం నేతలపై దాడులు పెరుగుతున్నాయని, తమ కార్యకర్తలపై నిర్బంధాలు ప్రయోగించినా, కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నా తాము మాత్రం ప్రజల పక్షాన ఎర్రజెండా పట్టుకొని పోరాటాలు చేస్తామన్నారు. ఇటీవల మహారాష్టల్రో 50వేల మంది రైతులు ఎర్రజెండా చేతబట్టి పాలకులకు తమ సత్తా చూపారని ఆమె గుర్తుచేశారు. ప్రజావ్యతిరేక పాలకులను ఓడించాలంటే కేసీఆర్, మమతాబెనర్జీలు కాదని, ప్రజాసమస్యలపై పోరాడే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ అవసరమన్నారు. టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ విధానాలు అన్నీ ఒకటేనని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో లక్ష కోట్ల రూపాయల అప్పులు చేశారని, 70ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో 16మంది ముఖ్యమంత్రులు 70వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆమె గుర్తుచేశారు. కేసీఆర్, చంద్రబాబు కొత్తమాటలు మాట్లాడుతున్నారని, బీజేపీని వ్యతిరేకిస్తున్నామంటూ ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారన్నారు. తెలంగాణలో బీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో 119 సీట్లకు పోటీ చేస్తామని, అందులో బీసీలకు 65సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సీపీఎం 22వ జాతీయ మహాసభలు ఈ నెలలో హైదరాబాద్‌లో జరగున్నాయని, ఆ మహాసభల్లో బహుజన రాజ్యసాధన కోసం అనేక తీర్మానాలు చేయనున్నామని చెప్పారు. వాటికి అనుకూలంగా వచ్చేవారిని కలుపుకొని ప్రజాకంటక పాలకులను గద్దె దింపుతామని బృందాకారత్ ధీమా వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ నాగేశ్వర్, నున్నా నాగేశ్వరరావు సదస్సులో పాల్గొన్నారు.

చిత్రం..ఖమ్మం సదస్సులో మాట్లాడుతున్న బృందాకారత్