రాష్ట్రీయం

లేపాక్షిని మరింత అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం: శిల్ప కళలకు నిలయమైన లేపాక్షి చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పేలా మరింత అభివృద్ధి చేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హర్షధ్వనుల నడుమ ప్రకటించారు. అనంతపురం జిల్లా లేపాక్షిలో రెండు రోజుల పాటు లేపాక్షి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు శనివారం ఉత్సవాలను ప్రారంభించగా ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకలను ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ నందమూరి కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని ఎంతగానో ఆదరిస్తున్న హిందూపురం ప్రజల రుణాన్ని తీర్చుకుంటున్నామన్నారు. లేపాక్షికి ప్రపంచ చిత్రపటంలో విశిష్ట గుర్తింపు తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. లేపాక్షి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ విశేష కృషి చేశారని ప్రశంసించారు.
ఉత్సవాలను తిలకించేందుకు జిల్లాతో పాటు కర్నాటకలోని గౌరిబిదనూరు, బాగేపల్లి, చింతామణి, మధుగిరి, బెంగళూరు, తదితర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో లేపాక్షి జనసంద్రమైంది. ఉత్సవాల సందర్భంగా గురుకుల విద్యాలయ ఆవరణలో భారీగా ఏర్పాటు చేసిన భువనగిరి సభా వేదిక చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ముగింపు వేడుకలకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన కళాకారులు తరలివచ్చి కళారూపాలను ప్రదర్శించారు. ప్రధానంగా ప్రముఖ సంగీత కళాకారులు అనూప్ రూబెన్ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి సభికులను ఆకట్టుకుంది. అలాగే ప్రముఖ సంగీత గాయకులు మురళీకృష్ణ, మాళవిక, సందీప్, తదితరులు పాటలు పాడి అలరించారు. అనంతరం ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన కర్నాటక ప్రముఖ సినీనటుడు శివరాజ్‌కుమార్, తెలుగు సినీ పరిశ్రమ చైర్మన్ అంబికా కృష్ణను, కళాకారులను ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఘనంగా సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే బాలయ్యను కలెక్టర్ సన్మానించారు.
ఆట పాటలతో అలరించిన బాలయ్య
లేపాక్షి నంది ఉత్సవాల ముగింపు వేడుకలో ఎమ్మెల్యే బాలకృష్ణ చూపరులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. తాను నటించిన పైసా వసూల్ చిత్రంలోని ‘వసూల్.. వసూల్.. పైసా వసూల్’ అనే పాట పాడడంతో పాటు నృత్యం చేసి అభిమానులను హుషారెత్తించారు.

చిత్రం..లేపాక్షి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాట పాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ