రాష్ట్రీయం

శ్రీశైల భ్రమరాంబికకు నేడు వార్షిక కుంభోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశెలం టౌన్, ఏప్రిల్ 2: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబదేవికి మంగళవారం వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సాత్విక బలి సమర్పించేందుకు కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ ఉత్సవంలో భాగంగా వేల సంఖ్యలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తారు. అన్నం రాశిగా పోసి హారతి ఇస్తారు. ఉదయం ప్రాతఃకాల పూజలు ముగిశాక ఆలయంలో అర్చకులు, వేదపండితులు అమ్మవారికి నవావరణ పూజ, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమార్చన జరుపుతారు. ఆలయం ముందు భాగంలో చాకలి వారిచే ముగ్గు వేయించి తొలివిడత సాత్విక బలిగా, నిమ్మ, కొబ్బరికాయలు సమర్పిస్తారు. గోపురం వద్ద కోటమ్మవారికి సాత్విక బలి సమర్పిస్తారు. సాయంత్రం మల్లికార్జునస్వామి వారికి ప్రదోషకాలపూజలు చేసి అన్నాభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం ఎదుట సింహ మండపం వద్ద వండిన అన్నాన్ని కుంభరాశిగా పోసి స్ర్తి వేషంలో ఉన్న పురుషుడితో రెండవసారి సాత్విక బలి అర్పిస్తారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి 9 రకాల పిండి వంటలు మహానివేదనగా సమర్పిస్తారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు.