రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌కు రాజీనామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 2: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించిన వెంటనే ఖమ్మం జిల్లా నుంచి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా నేతలు సైతం కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. తాజాగా కోదండరామ్‌కు కూడా ఖమ్మం జిల్లా నుంచే మద్దతు లభిస్తుండటం విశేషం. గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు సన్నిహితుడిగా మెలిగి, గతంలో ఆ పార్టీకి జిల్లా కన్వీనర్‌గా పనిచేసిన తాళ్ళూరి వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేశామని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జరిగిన ఉద్యమంలో అనేక కేసుల్లో కూడా ఉన్నామని, కేసీఆర్‌ను ఖమ్మం జిల్లా జైల్లో ఉంచినప్పుడు తాము కూడా అరెస్టయ్యామని, అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకు జరిగిన పోరాటంలో విజయం సాధించినా ఆత్మగౌరవాన్ని కేసీఆర్ ఎదుట తాకట్టు పెట్టలేకపోతున్నామన్నారు. నాడు జేఏసీ నేత కోదండరాం నేతృత్వంలో జరిగిన పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చిన కేసీఆర్ నేడు అదే వ్యక్తిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు సమైక్య రాష్ట్రంలో తాము ఎదుర్కొన్న సమస్యలకంటే అధికంగా ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా ఎదుర్కొంటున్నామన్నారు. రెండురోజుల్లో కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జన సమితి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కోదండరాం చేపడుతున్న పోరాటంలో పాలుపంచుకుంటామని స్పష్టం చేశారు. ఆ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తాళ్ళూరి వెంకటేశ్వరరావు