రాష్ట్రీయం

నా బ్రెయినే నాకు శత్రువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: మానసిక ఒత్తిడి తాళలేక ఓ టివి యాంకర్ అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- మెదక్ జిల్లా మానేపల్లికి చెందిన రాధిక (36) ముసాపేటలోని శ్రీ సువిల ఆపార్టుమెంట్‌లో ఉంటూ వి6 న్యూస్‌చానల్‌లో యాంకర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే ఆరు నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని సువిల అపార్టుమెంట్‌లోని తన చెల్లెలి కుటుంబంతో కలిసి తన 14ఏళ్ల కుమారుడితో పాటు ఉంటోంది. కాగా ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన రాధిక నేరుగా అపార్టుమెంట్ పైకి వెళ్ళి ఐదవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పైనుంచి ఏదో పడిన శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసిన వాచ్‌మెన్ అపార్టుమెంట్‌లోని వారికి, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి హ్యాండ్ బ్యాగ్‌లోని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ‘తాను డిఫ్రెషన్ కారణంగానే చనిపోతున్నానని, తన ఎవరూ మృతికి కారణం కాదని, నా బ్రెయినే నాకు శత్రువు’ అని రాసి ఉంది. దీంతో పోలీసులు డిప్రెషన్ వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు రాధిక గతంలో ఎన్‌టీవి, జెమిని న్యూస్‌లో యాంకర్‌గా పని చేశారు. భర్తతో విడిపోయి ఇనే్నళ్లు విడిగా ఉన్నా, ఇప్పుడు ఇంత ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పటికీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే కోణంలో విచారణ చేపట్టారు. మృతురాలికి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆమె వినియోగిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ డేటా వివరాలను తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
భాతిక కాయానికి పలువురు నివాళి
ఆత్మహత్యకు పాల్పడిన యాంకర్ రాధికరెడ్డి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. సోమవారం మూసాపేటలోని సువిల ఆపార్టుమెంట్‌లో ఉంచిన ఆమె మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, టియూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పాల్గొని నివాళులర్పించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ రాధిక కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహకారంకోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.