రాష్ట్రీయం

తొలి దశ తిరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ, కేంద్ర జల సంఘం నుంచి దాదాపు అనుమతులన్నీ లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశకు అటవీశాఖ అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం సమాచారం అందింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి లభించగానే కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపారు. సరిగ్గా పాలమూరు జిల్లా పర్యటనలో మంత్రి హరీశ్‌రావుఉన్న సమయంలోనే ఆ జిల్లాకు చెందిన ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతి లభించిన సమాచారం తెలియగానే ఆయన అమితానందం వ్యక్తం చేసారు. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మంచినీటి సరఫరా పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అటవీశాఖ అనుమతి కూడా లభించడంతో ఇక నుంచి సాగునీటి పనులను కూడా చేపట్టడానికి మార్గం సుగమమం అయిందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశలో ఐదు వందల ఎకరాల అటవీభూమిని సేకరించాల్సి ఉంది. దీనికి కేంద్ర అటవీశాఖ అనుమతి లభించడం కీలక పరిణామం. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 1.50 టిఎంసిల నీటిని 90 రోజుల పాటు (మూడు నెలలు) ఎత్తిపోసే విధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రీ-డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 30 వేల ఎకరాలు మొత్తంగా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రీ-డిజైన్ చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2016 జూన్ 10వ తేదీన రీ-డిజైన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది. తాజాగా సాగునీటి అవసరాల కోసం చేపట్టనున్న మొదటి దశ పనులకు కేంద్ర అటవీశాఖ అనుమతి లభించడం కీలక పరిణామం. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, శ్రీరామ్‌సాగర్ పునర్జీవ ప్రాజెక్టు వంటి భారీ ప్రాజెక్టులతో పాటు సీతారామ ఎత్తిపోతల వంటి మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న విషయం తెలిసిందే.