రాష్ట్రీయం

మళ్లీ మేమే వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇందుకు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిద్ధమేనా అని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, ఐటీశాఖ మంత్రి కేటీ.రామారావు సవాల్ విసిరారు. గురువారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన జనహిత ప్రగతి సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైతన్య యాత్ర అంటూ రాష్ట్రంలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 80 కాదు కదా ఆ పార్టీకి 8 సీట్లుకూడా రావన్నారు. 2004, 2009లో ప్రజలు అధికారం ఇస్తే ప్రజలకు, రైతులకు ఏమి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉంటూ తెలంగాణ వస్తే ఎలా పరిపాలన చేస్తారని, అంతా అంధకారంలోనే ఉంటుందని చెప్పారని నేడు ఆయనే అంధకారంలో ఉన్నారని, ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ నేడు రైతాంగానికి, ప్రజలకు 24 గంటల విద్యుత్ ఎడతెరపి లేకుండా ఇస్తున్నారని, దేశంలో నంబర్ వన్‌గా నిలిచారన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు చేపడితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు కోర్టులకు వెళ్తున్నారని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడవి ఉందని అందులో పులులు, సింహాలున్నాయని కోర్టుకు అబద్ధాలు చెప్పి ఆపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాను అక్కడికి పోయి చూశానని అడవి లేదని, పులులు, సింహాలు కూడా లేవని, కనీసం నక్కలు కూడా లేవని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. నల్లగొండ గులాబీకొండ అవుతుందని, ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లను గెలుచుకుంటామన్నారు. దేశంలో అతి పెద్ద ధర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను
దామరచర్ల మండలంలో నిర్మిస్తున్నామని, అది రాష్ట్రానికి, నల్లగొండ జిల్లాకు మణిహారం కాగలదన్నారు. కాళేశ్వరం, పాలమూరు తదితర నీటి పారుదల ప్రాజెక్టులతో కోటి ఎకరాల మాగాణిగా రాష్ట్రాన్ని మారుస్తామన్నారు. రాష్ట్ర సమగ్ర ప్రణాళికతో సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఏమ్మెల్యే భాస్కర్‌రావు, మునిసిపల్ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్ పాల్గొన్నారు.

చిత్రం..మిర్యాలగూడలో జరిగిన జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్‌ను సన్మానిస్తున్న దృశ్యం