రాష్ట్రీయం

తూర్పు కనుమల్లో కొండపల్లి బొమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 5: ఖండాంతర ఖ్యాతిగడించిన కొండపల్లి బొమ్మల తయారీకి ముడి సరుకుకు ఇపుడు తూర్పు కనుమల అడవులు ఆవాసంగా మారా యి. ముడి సరుకు కొరతను తీర్చి కళను కాపాడటానికి, ఈ కళాకృతుల తయారీలో తరతరాలుగా ఆధారపడిన కళాకారుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర అటవీ శాఖ వననిధి (ఉడ్ బ్యాంకు) పథకాన్ని చేపట్టింది. దా దాపు 20ఏళ్లుగా ముడి సరుకు అయిన పొనికి చెట్ల కల ప సరఫరాకు సాముదాయక విధానంలో కార్యాచరణ ప్రణాళిక చేపట్టింది. ఈ నేపథ్యంలో తూర్పు కనుమలు సంప్రదాయ కళాకృతులకు ఆవాసంగా మారాయి. అం తరించిపోతున్న కళను సంరక్షించుకునేందుకు తూర్పు కనుమల అడవులు ఆధారమయ్యాయి. కృష్ణాజిల్లా విజయవాడకు 16.5 కిలోమీటర్ల దూరంలోని ఒక చిన్న గ్రా మం కొండపల్లి. మన రాష్ట్రానికి కళారంగంలో ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టిన కొండపల్లి బొమ్మలు ఈ గ్రా మంలోనే తయారవుతాయి. ఈ బొమ్మలను రెండు చెట్ల నుంచి లభించే కలపతో తయారు చేస్తారు. వీటిని స్థాని క వ్యవహార భాషలో తెల్లపొనికి, నల్లపొనికి చెట్లుగా పి లుస్తారు. ఈ చెట్ల నుంచి లభించే తేలికైన, మెత్తని కలప బొమ్మల తయారీకి అనుగుణంగా కళాకారుల చేతుల్లో ఇట్టే ఒదిగిపోతుంది. వందల కుటుంబాలు ఈ బొమ్మల తయారీపై ఆధారపడి జీవిస్తుంటాయి.
ఖండాంతర ఖ్యాతి గడించిన కొండపల్లి బొమ్మల పరిశ్రమను ముడిసరుకు కొరత వేధిస్తోంది. బొమ్మలు తయారుచేసే అపార నైపుణ్యం, వాటికి సర్వత్రా ఆదరణ, మార్కెటింగ్ పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం పుష్కలంగా ఉన్నప్పటికీ, ముడిసరుకు కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రత్యేకంగా ఒకటి రెండు జాతుల చెట్లపైనే ఆధారపడి ఉండడం ఒక కారణమైతే, వాటి లభ్యత, నరికివేత మధ్య సమతౌల్యత లోపం ముడిసరుకు కొరతకు మరో కారణం. బొమ్మల తయారికీ వినియోగించే పొని కి చెట్లు అన్నిచోట్లా పెరిగేవి కావు. తెల్లపొనికి చెట్లు కొం డపల్లి సమీపంలోని అరణ్య ప్రాంతాల్లో, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాత్ర మే పెరుగుతాయి. ఇక నల్లపొనికి చెట్లు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో, ఒడిసా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో కన్పిస్తాయి. బొమ్మల తయారికి ఉపయోగపడాలంటే తెల్లపొనికి, నల్లపొనికి చెట్లకు కనీసం 20 ఏళ్ల వయసుండాలి. ఏటా చెట్ల వినియోగం పెరుగుతూవస్తుంటే ఆ మేరకు వాటి సహజ, కృత్రిమ పునరుత్పత్తి మాత్రం జరగడంలేదు.
కృష్ణా జిల్లాలోని కొండపల్లి రిజర్వు ఫారెస్టు, జి కొండూరు రిజర్వు ఫారెస్టు, ఎ కొండూరు రిజర్వు ఫారెస్టు ఏరియాల్లో నాలుగు వన సంరక్షణ సమితుల అధీనంలో 800 హెక్టార్లలో తెల్లపొనికి చెట్ల పెంపకాన్ని సాముదాయక అటవీ యాజమాన్య పధకం కింద చేపట్టాలని నిర్ణయించారు. బొమ్మల తయారీదారులకు సంవత్సరానికి 36 క్యూబిక్ మీటర్ల కలప అవసరం వుంటుందని అంచనావేశారు. ఈ చెట్ల నుంచి 13 ఏళ్ల పాటు నిరాటంకంగా కలప సరఫరా చేయవచ్చు. ఒక ఘనపు మీటరు కలప రూ.4000 ఖర్చుతో ఈ పథకంలో లభిస్తుందని అంచనావేశారు. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో కొంతభాగాన్ని సీఆర్‌డీఏకు బదలాయించడానికి ప్రతిపాదించారు. బదలాయింపునకు ప్రతిపాదించిన భాగంలో 40శాతం, మిగిలిన రిజర్వు ఫారెస్టులో 60శాతం పొనికి చెట్లు ఉన్నాయి. ముందుగా బదలాయింపు జరిగే ప్రాంతంలో ఉన్న పొనికి చెట్ల కోత ప్రారంభించాలని, అలాగే ఆ ఏరియాలో ఇంకా సైజుకి రాని పొనికి మొ క్కలను గుర్తించి, వాటిని ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ ద్వారా మిగిలిన రిజర్వు ఫారెస్టుకు తరలించి సంరక్షించాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఏటా ఐదు హెక్టార్ల విస్తీర్ణంలో 20 ఏళ్ల పాటు తెల్లపొనికి ప్లాంటేషన్లు పెంచడంవల్ల బొమ్మల తయారీదారులకు నిరంతరాయంగా కలప సరఫరా సాధ్యపడుతుందని నిర్ధారించారు.
ఇక తూర్పు కనుమల్లో పెరుగుతోన్న నల్లపొనికి చెట్ల నుంచి కలప రవాణాకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం అటవీ శాఖ వననిధి ప్రాజెక్టు చేపట్టింది. ఇరవై ఏళ్ల పాటు తూర్పు కనుమల ప్రాంతం నుంచి పంపిణీకి ఈ కార్యాచరణ చేపట్టినట్టు రాజమహేంద్రవరం ముఖ్య అటవీ అధికారి మూర్తి తెలిపారు. ప్రజాభాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ పర్యవేక్షణలో ఈ ఉడ్ బ్యాంకు నిర్వహణ కోసం నిర్దిష్ట ప్రణాళికను, పటిష్ట కార్యాచరణను రూపొందించామని ఆయన తెలిపారు.

చిత్రాలు..కొండపల్లి బొమ్మ తయారీకి ఉపయోగపడే పొనికి చెట్టు *కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగించే పొనికి చెక్కలు