రాష్ట్రీయం

పోటాపోటీగా పుస్తకావిష్కరణ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: రాజధాని అమరావతిపై విజయవాడ బందరు రోడ్డులో కొన్ని మీటర్ల దూరంలోనే వేర్వేరు ప్రదేశాల్లో గురువారం సాయంత్రం పోటాపోటీగా రెండు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. భారీగా ప్రజలు తరలి వస్తున్నారని తెలిసి ముందు జాగ్రత్తగా అడుగడుగునా భారీ పోలీస్ బందోబస్తు పెట్టారు. మొత్తంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అమరావతికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన పుస్తకావిష్కరణ, దానికి కూతవేటు దూరంలోనే రాజధానిని అడ్డుకుంటున్న మోదీ, జగన్, పవన్, ఐవైఆర్‌కు వ్యతిరేకంగా రాజధాని రైతులు, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపి హక్కుల సాధన సమితి ఆధ్వర్యాన సిరిపురపు శ్రీ్ధర్ నేతృత్వంలో జరిగిన మరో పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో ఎంబీ భవన్‌లో ఐవైఆర్ కృష్ణారావు రచించిన ‘ఎవరి రాజధాని అమరావతి ’పుస్తకాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించి, దానిని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితం ఇచ్చారు. ఆ పుస్తకంలో రాజధానికి ఎన్ని ఎకరాలు అవసరం, మిగిలిన ప్రాంతాల్లోని రాజధానుల వివరాలు ప్రస్తావించారు. ప్రభుత్వం అనవసర ప్రతిష్ఠకు పోయి నిబంధనలు ఉల్లంఘిస్తోందని విమర్శించారు. స్విస్ చాలెంజ్ విధానాన్నీ అందులో వివరించారు. అదే సమయంలో అటు రాఘవయ్య పార్కులో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, ప్రజాసంఘాలు, బ్రాహ్మణ చైతన్యవేదికకు చెందిన కార్యకర్తలతో సిరిపురపు శ్రీ్ధర్ రాసిన ‘అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న దుష్టచతుష్టయం’ పేరుతో రాసిన పుస్తకాన్ని ఒక రైతు ఆవిష్కరించగా, టీడీపీకి చెందిన దళిత నేత వర్ల రామయ్యకు అంకితం ఇచ్చారు. ఈ పుస్తకంలో రాజధానికి భూములిచ్చిన రైతుల వివరాలు, రాజధానికి వ్యతిరేకంగా బీజేపీ, వైసీపీ, జనసేన కలసి చేస్తున్న కుట్రలకు కృష్ణారావు ఏవిధంగా సహకరిస్తున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణారావు బ్రాహ్మణ ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. ఒక్కరోజులోనే రాజధాని నిర్మాణమవుతుందనుకుంటున్న కృష్ణారావు ఎలా ఐఏఎస్ అయ్యారో తనకు అర్థం కావడం లేదని, ఆయన ఎమ్మెల్సీ పదవి కోసమో, రాజ్యసభ సభ్యత్వం కోసమో కుట్రదారుల పంచన చేరినట్లున్నారని వర్ల ధ్వజమెత్తారు. కాగా ఈ రెండు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు సమీపంలోనే జరుగుతుండటంతో అక్కడ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. చివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.