రాష్ట్రీయం

అధికారం, వనరులు కొందరికే సొంతం కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో దళితులు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారు పారిశ్రామికవేత్తలుగా తయారుకావడానికి తన వంతు సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విద్యార్థి దశ నుంచే జగ్జీవన్‌రామ్ ఆశయమైన సామాజిక న్యాయం కోసం తాను కృషిచేస్తూ అధికారం, వనరులు కొద్దిమందికే సొంతం కాకూడదని అందరికీ దక్కాలన్న ఆశయంతోనే పనిచేస్తున్నానని కూడా స్పష్టం చేశారు. గురువారం బందరురోడ్డులోని ఎ-1 కనె్వన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన బాబూ జగ్జీవన్‌రామ్ 111వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు వివిధ వాహనాలు అందించారు. అనంతరం ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి సభాస్థలికి చేరుకుని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాడు ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు బాబూ జగ్జీవన్‌రామ్ చెప్పిన సమాధానాన్ని చదివి వినిపించారు. సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలని పాత్రికేయుడికి జవాబు ఇచ్చారని అలాంటి నిర్ణయానే్న ప్రత్యేక హోదాపై తాను తీసుకున్నానన్నారు. ఎంతోమంది పుడతారు, ఎంతో మంది చనిపోతారు కానీ చరిత్రలో కొద్దిమంది పేరే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలబడుతుందని అలాంటి వారిలో బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరన్నారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని, సాధారణ కుటుంబంలో జన్మించి ఆనాడు ఉన్న వివక్షతను తట్టుకుని జీవితంలో ఎన్నో సాధించారన్నారు. 11ఏళ్ల వయస్సులో అప్పర్ ప్రైమరీ పరీక్ష పాసై బెనారస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసి, 28 ఏళ్ల వయస్సులో 1936లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారన్నారు. చిన్న వయస్సులోనే మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం తన పదవిని వినియోగించలేదని, ప్రజలకు సేవ చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇండస్ట్రియల్ డిస్క్యూట్ యాక్ట్, లేబర్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్‌లను తీసుకువచ్చారన్నారు. దేశంలో రైల్వేబోర్డును, రైల్వే జోన్‌లను ఆయన కాలంలోనే తీసుకువచ్చారన్నారు. అమరావతి రాజధానిలో 10 ఎకరాల్లో బాబూ జగ్జీవన్‌రామ్ పేరుతో ‘సమతావనం’ను రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. చరిత్ర ఉన్నంత వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్‌లు నిలిచే ఉంటారని, ఏప్రిల్ నెలలోనే అనేకమంది మహానుభావులు పుట్టారని, అలాంటి మహానుభావుల ప్రభావం తన మీద కూడా ఉండటంతోనే తాను కూడా దళితుల పక్షపాతిగా సేవలు అందిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని, ఎస్సీ సబ్ ప్లాన్ కింద గత నాలుగేళ్లలో రూ.29,868 కోట్లు ఖర్చు చేశామని, ఈ బడ్జెట్‌లో రూ.11,228 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. దళిత యువకులకు స్వయం ఉపాధి కింద 200 ఇన్నోవా వాహనాలు, 100 బొలేరో, టయోటా ఇటియోస్, స్విఫ్టు డిజైర్ వాహనాలను అందజేశామన్నారు. జగ్జీవన్ జ్యోతి పథకం ద్వారా 100 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే దళితులకు అందులో 75 యూనిట్లు ఎటువంటి చార్జీ లేకుండా సబ్సిడీ ఇస్తున్నామన్నారు. డప్పు కళాకారులకు రూ.12 కోట్లు వెచ్చించి నెలకు రూ.1500 పెన్షన్లు ఇస్తున్నామని, అదే విధంగా చెప్పులు కుట్టేవారికి తొలిసారిగా బడ్జెట్‌లో రూ.60 కోట్లు సాయం అందించేందుకు కేటాయించామని, లిడ్‌కాప్ అభివృద్ధికి మరో రూ.90 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు. రూ.300.77 కోట్ల వ్యయంతో రూ.33.92 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో స్కాలర్‌షిప్ కింద గత నాలుగేళ్లుగా 758 హాస్టళ్లలో 70,167 మంది విద్యార్థులకు రూ.872.61 కోట్లు ఇచ్చామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యోన్నతి పథకం కింద 327 మంది దళిత విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల వంతున ఇచ్చినట్లు తెలిపారు. మంత్రులు నక్కా ఆనందబాబు, కెఎస్ జవహర్, దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జెఆర్ పుష్పరాజ్, తదితరులు పాల్గొన్నారు.