రాష్ట్రీయం

ప్రదీప్ శక్తి హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలన్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఓ మార్క్ వేసుకున్న ప్రదీప్ శక్తి కన్నుమూశారు. కొంతకాలంగా అమెరికాలో స్థిరపడిన ఈయన, శనివారం తీవ్ర గుండెపోటుకు గురై మరణించారు. తెలుగులో చేసినవి కొద్ది సినిమాలే అయినా, ఆయన చేసిన పాత్రలన్నింటిపైనా ప్రత్యే క మార్క్ వేయగలిగారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి చాలా సినిమాలు చేసిన తరువాత, కొత్త విలన్లు, కమెడియన్ల హవా పెరగడంతో ఆయన నటనకు దూరమయ్యారు. అవకాశాలు తగ్గిన సమయంలో అమెరికాలోని హోటల్ వ్యాపారంలో స్థిరపడిన ప్రదీప్, అనుకోకుండా అవకాశాలు రావడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ చేసిన కొద్ది పాత్రలతో సత్తా చూపించారు. అమెరికాలో హోటల్ వ్యాపారంలో స్థిరపడిన ప్రదీప్, తాను నటించిన చివరి సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌లో అదే తరహా పాత్రను పోషించడం విశేషం. ఒకదశలో వంశీ సినిమాల్లో చిత్రమైన పాత్రలు పోషించిన ప్రదీప్, ఆ పాత్రలతోనే చిరస్థాయిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఏప్రిల్ 1 విడుదల, చిత్రం భళారే విచిత్రం, చెట్టుకింద ప్లీడర్, అగ్గిరాముడు, బ్రహ్మ, కలియుగ విశ్వామిత్ర, గుణ, ఆలాపన, పరుగో పరుగు, గోపి గోపిక గోదావరి, చింతకాయల రవి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో ప్రదీప్ శక్తి పోషించిన పాత్ర చిరస్మరణీయంగా గుర్తుండిపోయేవే. ప్రదీప్ శక్తి మృతి చెందాడన్న వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.