ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. వైకాపా, టిడిపి కార్పొరేటర్ల మధ్య బడ్జెట్ వ్యవహారంగా తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. శనివారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు కార్పొరేషన్ 2016-17 బడ్జెట్ సమావేశం ఇన్‌చార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చర్చ ప్రారంభం కాగానే టిడిపి కార్పొరేటర్ సి విజయ తమ ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనుల కారణంగా చాలామంది నిర్వాసితులవుతారని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించి తగు న్యాయం చేయాలని కోరారు. తన డివిజన్‌లో తనకు తెలియకుండా అధికారులే పనులు చేస్తున్నారని, అందుకు సంబంధించి లెక్కలను తనకు నివేదిక రూపంలో అందజేయాలని మరో కార్పొరేటర్ ముత్తమ్మ కోరారు. సమావేశంలో వైకాపా కార్పొరేటర్ పురుషోత్తంరెడ్డి బడ్జెట్‌పై మాట్లాడుతుండగా వైకాపా, టిడిపి కార్పొరేటర్ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. కార్పొరేటర్లు తమ డివిజన్ పరిధిలో సమస్యలను విన్నవించే సమయంలో తమకు సమయం చాలడంలేదంటూ ఇరువర్గాల వారు సమావేశాన్ని గందరగోళం చేయడంతో ఇన్‌చార్జ్ మేయర్ కలుగజేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచారు.

డిఎస్సీ-2014 పోస్టులన్నీ
భర్తీ చేయాలి : ఎస్టీయు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: డిఎస్సీ-2014లో భర్తీ కాని 274 టీచర్ పోస్టులను డీరిజర్వు చేసి వాటన్నింటినీ భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టియు) ప్రభుత్వాన్ని కోరింది. డిఎస్సీ నోటిఫికేషన్‌లో 381 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అర్హులైన బ్యాక్‌లాగ్ అభ్యర్థులు లేకపోవడంతో పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎస్‌టియు పేర్కొంది. 2006 డిఎస్సీలో బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ డీరిజర్వు చేసి అర్హులైన ఇతర అభ్యర్థులతో భర్తీ చేశారని, ఇప్పుడు కూడా అదే పద్ధతిలో పోస్టులన్నీ భర్తీ చేయాలని సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కత్తి నరసింహారెడ్డి, జోసెఫ్ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు విద్యాశాఖ ద్వారానే జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రైవేట్ వర్శిటీలపై నిపుణుల కమిటీ
ఏపి సర్కార్ జీవో
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు యూనివర్శిటీలను నెలకొల్పే అంశంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో ఐఎస్‌బి ఫౌండింగ్ డీన్ ప్రమత్‌రాజ్ సిన్హా, సిల్వెంట్ అడ్వయిజర్ ఆనంద్ సుదర్శన్, కేంద్ర ప్రభుత్వ సైన్స్, టెక్నాలజీ మాజీ కార్యదర్శి పల్లె రామారావు, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ వైస్ చైర్‌పర్సన్ స్వాతి పిరమల్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆవుల దామోదరంలను నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది.