రాష్ట్రీయం

కాళేశ్వరం.. ఓ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రంగంలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనుల్లో శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల పని జరగడం అరుదైన రికార్డుగా నిలిచింది. వర్షాలు ప్రారంభమయ్యేలోగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానమైన పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో రాత్రింబవళ్లు పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలం నాటికి కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి నీటిని అందించాలని తన పర్యటన సందర్భంగా సీఎం సూచించడంతో ఆ దిశగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. సీఎం పర్యటనకు ముందు వరకు మేడిగడ్డ బ్యారేజీ పనులు రోజుకు సగటున 1169 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరుగగా, ప్రస్తుతం ఇక్కడ 7 వేల క్యూబిక్ మీటర్ల పనులు జరగడం అసాధారణ రికార్డుగా ఇంజనీరింగ్ నిపుణులు కొనియాడుతున్నారు. పకడ్బందీ ప్రణాళిక, వివిధ శాఖలు, అధికారుల మధ్య సమన్వయం, అవసరమైన మేరకు యంత్ర పరికరాలు అందుబాటులో ఉండటం, కార్మికులు, ఇంజనీర్ల సంఖ్యను పెంచడం వల్లనే సాధ్యమైందని నీటిపారుదల శాఖ మంత్రి టి హరీశ్‌రావు విశే్లషించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను సీఎం కేసిఆర్ సందర్శించే నాటికి అక్కడ 77,946 క్యూబిక్ మీటర్ల పనులు జరుగగా, ప్రస్తుతం ఇది 5,39,361 క్యూబిక్ మీటర్లకు చేరుకుంది. సీఎం పర్యటన ముందు నిర్మాణ కార్మికుల సంఖ్య 1245 ఉండగా ప్రస్తుతం ఈ సంఖ్య 3065కు పెరిగింది. అలాగే ఇంజనీర్ల సంఖ్యను 112 నుంచి
162కు పెంచారు. ట్రాన్సిట్ మిక్సర్ల సంఖ్యను 25 నుంచి 85కు పెంచారు. ఎప్పటికప్పుడు సీఎం కేసిఆర్, సంబంధిత మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు పనులను సమీక్షించడం వల్లనే అసాధారణ రికార్డులను సాధించగలిగామని మేడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదే వేగంతో ప్రాజెక్టును పూర్తి చేసి నీటిపారుదల రంగంలో ఆసియాలోనే రికార్డు నెలకొల్పబోతున్నామని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న అంతర్‌రాష్ట్ర అభ్యంతరాలు తొలిగిపోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అనుమతులు లభించడం, వివిధ శాఖల మధ్య సమన్వయం, కార్మికుల నిరంతర శ్రమ, ఇంజనీరింగ్ అధికారుల అంకితభావం వెరసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ రంగ చరిత్రను తిరగరాస్తుందని మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తం చేసారు.
చిత్రం..నాగులమల్యాల వద్ద ఆదివారం ఫీడర్ చానల్ పనులకు శంకుస్థాపన చేస్తున్న హరీశ్‌రావు