ఆంధ్రప్రదేశ్‌

గెడ్డసింగిపురం సమీపంలో ఏనుగుల సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జియ్యమ్మవలస, సెప్టెంబర్ 6: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ్డసింగిపురం సమీపంలో ఏనుగులు సంచరిస్తుండటంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. గెడ్డసింగిపురం, డంగభద్ర, బూరిరామినాయుడువలస, ఏనుగులగూడ, అర్నాడ, వనిజ గ్రామాలకు చెందిన ప్రజలు కంటిమీద కునుకు లేకుండా ఉన్నారు. ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం గోపాలపురం, గోర, గెండసింగిపురం గ్రామాల మధ్య సంచరించిన ఏనుగులు ఇక్కడకు రావడంతో గతంలో పడిన కష్టాలు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నాయి. 2009లో ఇవే ఏనుగులు డంగభద్ర సమీపంలో రాజుగారి పామాయిల్ తోటలోకి వచ్చాయి. ముగ్గురు వ్యక్తులను పొట్టన పెట్టుకున్నాయి. అప్పట్లో ఆపరేషన్ గజ పేరుతో అటవీశాఖాధికారులు 25 రోజులపాటు పామాయిల్ తోటలో మకాం వేసి ఏనుగులను ఒడిశా ప్రాంతానికి తరలించారు. మళ్లీ ఏనుగులు ఈ ప్రాంతానికి రావడంతో అప్పటి కష్టాలన్నీ పునరావృతం అవుతాయేమోనని గిరిజనులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అటవీ శాఖ అధికారులు ఏనుగులగూడ గ్రామంలో పర్యటించి రాత్రిపూట తిరగవద్దని, తలుపులు వేసుకుని ఇళ్లల్లో ఉండాలని అప్రమత్తం చేశారు. గురువారం స్థానిక తహశీల్దార్ భాస్కరరావు అర్నాడ, వనిజ, ఏనుగులగూడలో పర్యటించి గిరిజనులను అప్రమత్తం చేశారు. విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారులు ఒకవైపు, శ్రీకాకుళం జిల్లా అటవీశాఖ అధికారులు మరోవైపు ఏనుగులను ఒరిశా వైపు పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల మీదుగా ఒడిశా ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 7 పెద్ద ఏనుగులు, ఒక పిల్ల ఏనుగు ఉంది. ఈ పిల్ల ఏనుగు కొండలపైకి ఎక్కలేకపోవడంతో ఏనుగులు పల్లపుప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాలవైపు రాకుండా, పంటలకు నష్టం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.