ఆంధ్రప్రదేశ్‌

పర్యాటక అభివృద్ధి సంస్థలో ఇక విజిలెన్స్ మరింత పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 11: పర్యాటక అభివృద్ధి సంస్థలో విజిలెన్స్ విభాగాన్ని మరింత పటిష్ఠపరచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. వివిధ విభాగాల నుండి నిరంతరం విజిలెన్స్ నివేదికలు తెప్పిస్తున్నామని, వాటిని కేంద్ర కార్యాలయం పరిశీలిస్తుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఉపేక్షించబోమని శుక్లా స్పష్టం చేశారు. స్థానిక పర్యాటక అభివృద్ధి సంస్థ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర, డివిజన్, జిల్లా స్థాయి పర్యాటక అధికారులతో శుక్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని, ప్రత్యేకించి పర్యాటక రంగంలో ఈ వ్యవహారాలకు పాల్పడితే అది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభావితం అవుతుందని స్పష్టం చేశారు. అంతర్గత నివేదికలను అనుసరించి కొందరు ఉద్యోగులపై ప్రత్యేకంగా దృష్టి నిలిపామని, వారు పనితీరు మార్పుకోకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన శుక్లా గత ఏడాదితో పోల్చితే 15 నుండి 20 శాతం మేర అభివృద్ధి చేసిన వారిని అభినందించారు. అదే క్రమంలో 7 శాతం నుండి 15 శాతం వరకు ప్రగతి చూపిన వారిని తమ పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు ఏపీటీడీసీలో సేవలు అందిస్తుండగా ప్రతి నెల 40 మందిని స్టార్ హోటళ్లలో శిక్షణకు పంపనున్నామన్నారు. ఉద్యోగుల పనితీరును మెరుగు పరిచే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్లలోనూ బయోమెట్రిక్ సిస్టమ్‌ను అమలు చేయనున్నామని, ఇందుకు ఎవ్వరూ అతీతులు కాదని అన్నారు.