ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 19: రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ చేసిన మోసం, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు విస్మరించడాన్ని ప్రజలు గ్రహించారన్నారు. అందుకే వారు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. కర్నూలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం, క్రిస్టియన్లపై దాడులు చేయిస్తూ కులమతాల పేర చిచ్చుపెడుతోందని ఆరోపించారు. ప్రాంతీయ భేదాలు లేకుండా కులమతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా కలుపుకుని పోతోందన్నారు. కర్నూలులో మంగళవారం నిర్వహించిన సత్యమేవ జయతే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావడంతో ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో ప్రజలు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపారన్నారు.
కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రంవిఫలమైందన్నారు. రుణమాఫీ చేస్తానని గొప్పలు చెప్పిన సీఎం చంద్రబాబు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఎల్‌సీ పైపులైన్ల నిర్మాణానికి నిధులు, గుండ్రేవుల రిజర్వాయర్, సిద్దేశ్వరం అలుగు తదితర ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేస్తే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. టీడీపీ, వైకాపా వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌తోనే అది సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర విభజన అన్ని పార్టీల అభిప్రాయం మేరకే జరిగిందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తప్పు చేసిందని భావించి ప్రజలు గత ఎన్నికల్లో ఓడించారన్నారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ తప్పూ చేయలేదని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్‌ను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, మదనగోపాల్, జడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఖలీల్‌బాషా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.