ఆంధ్రప్రదేశ్‌

ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* హోదా ఇవ్వొద్దని ఎవరు.. ఎక్కడ చెప్పారు? * అసెంబ్లీలో బీజేపీకి బాబు చురకలు
అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఎవరు..ఎక్కడ చెప్పారో తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు.
‘ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఊరుకోనని ముఖ్యమంత్రి ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లగలిగారు..అంతర్జాతీయ విమానాశ్రయం రాకపోవటానికి కూడా మేమే కారణమా? అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రిగా ఉన్నారుకదా’ అని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. వైసీపీ సభ్యులు మమ్మల్ని ఫాలో అవటానికి సభలోలేరుకదా అని వ్యాఖ్యానించారు.
కేంద్రం ప్రత్యేక రైల్వేజోన్ మంజూరు చేస్తుందని, హోదా సాధ్యపడదని ఫైనాన్స్ కమిషన్ స్పష్టం చేసిందని అంటుండగా ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద 90:10 నిష్పత్తితో, ప్రత్యేక కేటగిరీ కింద 90:10 నిష్పత్తితో పాటు పరిశ్రమల స్థాపనకు 11 రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ప్రకటించిన ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు.
సభలో అవాస్తవ ప్రకటనలుచేసి రెచ్చకొట్టవద్దని హెచ్చరించారు. మీకు ధైర్యం ఉంటే.. ఈ గడ్డపై పుట్టి ఉంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. కేంద్రంపై చేసే పోరాటం భావితరాల కోసమని స్పష్టంచేశారు. అంతా సహకరిస్తేనే హక్కులు సాధించు కోగలమన్నారు. కేంద్ర వంచనను జీర్ణించుకోలేక పోతున్నాం.. ఇంకా కుట్ర రాజకీయాలుచేసి చరిత్రలో కలసిపోవద్దని వ్యాఖ్యానించారు.
ఒక జాతీయ పార్టీ కట్టుబట్టలతో విభజన చేస్తే మరో జాతీయ పార్టీ నమ్మక ద్రోహానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. దెబ్బ మీద దెబ్బ తగిలితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మోదీకి తెలియదా అని నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని..సహకరించిన వారిని కూడా ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. ఇలానే చేస్తే మీరే చూస్తారు.. రాబోయే రోజుల్లో ఏరకంగా ఉంటుందనేది.. సున్నితమైన అంశాలపై అడ్డంగా మాట్లాడవద్దని ఉద్బోధించారు. ఆంధ్రుడనుకునే ప్రతి వ్యక్తి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని భావిస్తే ‘బొబ్బిలిపులి’లా తిరగబడాలని పిలుపునిచ్చారు. కేసుల భయంతోనే ప్రతిపక్ష నేత జగన్ కేంద్రాన్ని నిలదీయటం లేదన్నారు. దీనిపై విష్ణుకుమార్‌రాజు సానుకూలంగా స్పందిస్తూ ‘ఆంధ్రకు అన్యాయం జరిగిందని భావిస్తే తీర్మానాన్ని ఆమోదిస్తున్నానని’ మద్దతు తెలిపారు.