ఆంధ్రప్రదేశ్‌

నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: ఏపీఎస్ ఆర్టీసీలో యాజమాన్యం గుర్తింపు సంఘంతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా కోడ్ ఆఫ్ డిస్‌ప్లేన్ సర్క్యులర్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్‌లో అలాంటి సంఘటనలకు జరగకుండా ఉండేందుకు ఈ నెల 22,23 తేదీల్లో 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోలు, జోనల్ వర్కు షాపుల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ఇన్‌ఛార్జి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సైబర్ క్రైం కేసులో నైజీరియన్‌సహా ముగ్గురికి జైలు
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 21: సైబర్ క్రైం కేసులో నేరం రుజువుకావడంతో ఓ విదేశీయునితో సహా ముగ్గురికి ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తొమ్మిది మాసాలు జైలుశిక్ష లేదా 60వేల రూపాయలు జరిమానా విధించింది. ఈమెయిల్ ద్వారా వ్యక్తులను పరిచయం చేసుకుని వారి బ్యాంకు ఖాతా నుంచి నగదు డ్రా చేసుకుని నిందితులు ఆన్‌లైన్ నేరాలకు పాల్పడినట్లు డీసీపీ గజరావ్ భూపాల్ వెల్లడించారు. ఈ కేసు విచారణలో నైజీరియన్ నకిలీ వీసా మీద ఇండియాలో ఉంటున్నట్లు వెల్లడైనందున అతనిపై నమోదైన మరో కేసులో కూడా నాలుగు నెలల జైలు, 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ భూపాల్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ తోహిద్ అలియాస్ తోసిద్ ఖాన్ అలియాస్ రషీద్, జియాఉల్ హుస్సేన్, నైజీరియాకు చెందిన అడిగున్ బాబాతుండె కమల్ అలియాస్ అడిగున్ స్మిత్ బాబా తుండే అలియాస్ కమల్ అలియాస్ స్మిత్ ఈ ముగ్గురూ కలిసి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న క్రమంలో ఈమెయిల్ ద్వారా నగరంలోని మాచవరం పోలీస్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఓ వ్యక్తిని 2017 డిసెంబర్ 18వ తేదీన పరిచయం చేసుకుని అతడిని నమ్మించి అతనికి బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకుని ఆన్‌లైన్ ద్వారా రూ.4,50లక్షలు తస్కరించారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులను గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే ముగ్గురిలో ఒకరైన నైజీరియన్ నకిలీ వీసాతో ఇండియాలో ఉంటున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో అతనిపై మరో కేసు నమోదు చేశారు. కోర్టులో ఈ రెండు కేసుల్లో నిందితులపై నేరం రుజువైంది. విలేఖరుల సమావేశంలో సిఐలు జివివి సత్యనారాయణ, సహేరా బేగం, ఎస్‌ఐ జానకీ రామయ్య తదితరులు పాల్గొన్నారు.