ఆంధ్రప్రదేశ్‌

ముగ్గురు తమిళనాడు గంజాయి స్మగ్లర్ల్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 25: ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల మాదిరిగా విశాఖ నుంచి చెన్నైకు గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. ఇదే బస్సులో వెళ్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని బంగారం స్మగ్లర్‌గా గుర్తించారు. ముందుగా అందిన సమాచారం మేరకు నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో టాస్క్ఫోర్స్ ఏసిపి పి మురళీధర్ నేతృత్వంలో సిబ్బంది సోమవారం అర్ధరాత్రి దాటాక నగరంలోని మహానాడురోడ్డు వద్ద ప్రవీణ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో తనిఖీలు నిర్వహించారు. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న ఈ బస్సులో స్మగ్లర్లు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఈ సోదాలు నిర్వహించగా.. తమిళనాడుకు చెందిన రవికుమార్ పాండ్య, సతీష్‌కుమార్ మల్లార్ మామన్, సత్యకుప్పుస్వామి అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగా ప్రయాణిస్తున్న వీరి వద్ద నుంచి సుమారు ప్యాకింగ్ చేసిన 18కేజీల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,370వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు తరచూ విశాఖ వచ్చి ఇక్కడ గంజాయి కొనుగోలు చేసి చెన్నై తీసుకెళ్లి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
బంగారం స్మగ్లర్ నుంచి నగదు స్వాధీనం
ఇదే బస్సులో బంగారం స్మగ్లర్‌ను కూడా టాస్క్ఫోర్స్ తనిఖీల్లో గుర్తించారు. బస్సులో సోదాలు జరుపుతుండగా మహారాష్టక్రు చెందిన విజయరాజు పాటిల్ అనే వ్యక్తి వస్తధ్రారణ అనుమానాస్పదంగా కనిపించింది. ప్రత్యేకంగా డిజైన్ చేసి కుట్టించుకున్న జాకెట్ ధరించి ఉన్నాడు. జాకెట్‌లో లోపల ప్రత్యేకంగా జిప్‌లు కలిగిన జేబులు ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 32లక్షల రూపాయలు అనధికార నగదు దొరికింది.
విజయరాజు పాటిల్ మూడేళ్ళ క్రితం మహారాష్ట్ర నుంచి వచ్చి రాజమండ్రిలోని స్నేహితుని వద్ద ఉంటూ ఒక షాపులో పని చేస్తున్నాడు. కాగా బంగారం స్మగ్లింగ్ ప్రవృత్తిగా ఎంచుకుని తరచూ చెన్నై వెళ్లి అక్కడ బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి బిల్లులు లేకుండా తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.